Ponniyen Selvan సినిమాను తమిళ ప్రేక్షకులు మామూలుగా ఓన్ చేసుకోవట్లేదు. తమిళేతర భాషల్లో ఈ సినిమాను పూర్తిగా తిరస్కరించగా.. తమిళంలో మాత్రం ఈ చిత్రాన్ని నెత్తిన పెట్టుకున్నారు. అది ఏ స్థాయిలో అంటే తొలి రోజు నుంచి ఈ సినిమా రికార్డుల మోత మోగిస్తూ సాగిపోతోంది.
తమిళంలో ఒక్కో బాక్సాఫీస్ రికార్డునూ పొన్నియన్ సెల్వన్ తన ఖాతాలో వేసుకుంటోంది. తమిళనాట అత్యంత వేగంగా వంద కోట్ల వసూళ్లు సాధించిన చిత్రం అదే. ఈ ఏడాది అత్యధిక తొలి రోజు, తొలి వీకెండ్ వసూళ్లు రాబట్టిన సినిమాగానూ పొన్నియన్ సెల్వన్ ఘనత సాధించింది.
వరల్డ్ వైడ్ ఈ సినిమా వసూళ్లు ఇప్పటికే రూ.300 కోట్లకు చేరుకోవడం విశేషం. కాగా అందులో తమిళ వెర్షన్ వాటానే 80 శాతానికి పైగా ఉంది. ఇప్పటికే తమిళంలో బాహుబలి కలెక్షన్లను దాటేసిన పొన్నియన్ సెల్వన్.. త్వరలోనే విక్రమ్ వసూళ్లను కూడా అధిగమించబోతోంది. ఫుల్ రన్లో 2.0ను దాటి నంబర్ వన్ తమిళ సినిమాగా నిలిచే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం.
విదేశాల్లో ఆల్రెడీ 2.0 వసూళ్లను ఈ చిత్రం అధిగమించేసింది. దాదాపుగా పొన్నియన్ సెల్వన్ రిలీజైన ప్రతి దేశంలోనూ ఇది ఆల్ టైం నంబర్ వన్ తమిళ సినిమాగా రికార్డు అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. విక్రమ్ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ సాధించిన వసూళ్లను యుఎస్‌లో మూడు రోజుల్లోనే పొన్నియన్ సెల్వన్ దాటేయడం విశేషం. అక్కడ ఈ సినిమా వసూళ్లు 5 మిలియన్ డాలర్లకు చేరువగా ఉన్నాయి.
5.5 మిలియన్ డాలర్లతో 2.0 నెలకొల్పిన రికార్డును పొన్నియన్ సెల్వన్ బద్దలు కొట్టడం లాంఛనమే. ఈ సినిమా చూడడాన్ని తమ బాధ్యతగా ఫీలవుతున్నట్లున్నారు తమిళ ప్రేక్షకులు. అక్కడ సాహిత్య చరిత్రలోనే అత్యంత ఆదరణ పొందిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమాను రూపొందించాడు. మిగతా భాషల వాళ్లు తిరస్కరించినప్పటికీ.. తమిళ వెర్షన్ సాధించిన విజయం రెండో భాగం తీయడానికి మణి అండ్ టీంకు గొప్ప ప్రోత్సాహాన్నిచ్చేదే.
This post was last modified on October 7, 2022 7:34 am
గత రెండు రోజులుగా ఇటు సోషల్ మీడియాలోను, అటు ప్రధాన మీడియా ఛానెళ్లలోను.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం.. ప్రపంచ…
పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…