Movie News

మార్కెట్ మీద సల్మాన్ ప్రభావమెంత

మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తో ఎంతో సాన్నిహిత్యం ఉన్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కేవలం ఆ కారణంగానే ఎలాంటి పారితోషికం తీసుకోకుండా గాడ్ ఫాదర్ లో స్పెషల్ క్యామియో చేసిన విషయం నెల రోజులగా వివిధ ప్రమోషన్లలో హోరెత్తిపోతూనే ఉంది. కేవలం ఈ క్యారెక్టర్ కోసమే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన హిందీ మూవీ లవర్స్ ఉన్నారు. ఒరిజినల్ లో పృథ్విరాజ్ సుకుమారన్ చేసిన పాత్రను సల్లు భాయ్ తో చేయించడం వల్ల నార్త్ మార్కెట్ కి బాగా ఉపయోగపడుతుందన్న నిర్మాతల ప్లాన్ అంతగా వర్కౌట్ అయినట్టు కనిపించడం లేదు. కారణం ఓపెనింగ్స్ కి వచ్చిన కలెక్షన్.

తెలుగు రాష్ట్రాల్లో మెగా మేనియా జోరుగా ఉన్నప్పటికీ ఉత్తరాదిలో మాత్రంగా గాడ్ ఫాదర్ ఎదురీదుతున్నట్టు ట్రేడ్ రిపోర్ట్. దేశవ్యాప్తంగా హిందీ వెర్షన్ కి కేవలం కోటి నుంచి కోటిన్నర మధ్యలో వచ్చినట్టుగా చెబుతున్నారు. సల్మాన్ ని పోస్టర్లు టీజర్ లో హై లైట్ చేస్తూ ప్రమోట్ చేసినప్పటికీ దానికి తగ్గట్టు టికెట్ కౌంటర్ల దగ్గర సందడి లేదన్నది ముంబై అప్డేట్. అయితే మౌత్ టాక్ పాజిటివ్ గా ఉన్న కారణంగా ఈ వీకెండ్ లో పికప్ అయ్యే అవకాశాలు కొట్టి పారేయలేం. బిగ్గెస్ట్ డిజాస్టర్ గా రికార్డులు సృష్టించిన లైగర్ కు ఫస్ట్ డే అయిదు కోట్లకు పైగానే నమోదు కావడం మర్చిపోకూడదు.

మొత్తానికి సల్మాన్ ఖాన్ ప్రభావం ఎంతనేది కనీసం పది రోజులు ఆగితే కానీ క్లారిటీ రాదు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం మాస్ జనానికి విక్రమ్ వేదా ఒకటే ఆప్షన్ గా ఉంది. అది కూడా యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు కానీ స్టార్ క్యాస్టింగ్, ఎలివేషన్ల వల్ల బాగానే రాబడుతోంది. పొన్నియన్ సెల్వన్ 1 వాళ్లకు కనెక్ట్ కాలేదు. సో గాడ్ ఫాదర్ కు ఇవన్నీ అనుకూలించే అంశాలే. ఈ శుక్రవారం అమితాబ్ రష్మిక మందన్నల గుడ్ బై ఒకటే స్ట్రెయిట్ రిలీజ్. ఆ నలుగురు టైపులో అదో ఎమోషనల్ డ్రామా కాబట్టి దాని వల్ల వచ్చిన ముప్పయితే లేదు. చూడాలి మరిసల్లు భాయ్ మేజిక్ ఏం చేయనుందో

This post was last modified on October 6, 2022 5:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మురారి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే

ఫస్ట్ విడుదల కావాల్సిన బైకర్ హఠాత్తుగా వెనక్కు తగ్గడంతో శర్వానంద్ మరో సినిమా నారీనారీ నడుమ మురారి ముందుకు వచ్చేసింది.…

18 minutes ago

అమెరికాలో బిర్యానీ లవర్స్‌కు షాక్ తప్పదా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై…

1 hour ago

`వేమిరెడ్డి` వేడి.. వైసీపీని ద‌హిస్తుందా.. !

రాజ‌కీయంగా ప్ర‌శాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రినీ టార్గెట్ చేయ‌లేదు. త‌న స‌తీమ‌ణి,…

2 hours ago

తెలంగాణ విజ‌న్ డాక్యుమెంట్ లో ఏముంది?

తెలంగాణ‌లో సీఎం రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. స్వ‌ప్నిస్తున్న తెలంగాణ విజ‌న్ డాక్యుమెంటును తాజాగా మంగ‌ళ‌వారం సాయంత్రం ఫ్యూచ‌ర్…

2 hours ago

అఫీషియల్ – అఖండ 2 ఆగమనం

రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…

3 hours ago

హార్దిక్ దెబ్బకు పవర్ఫుల్ విక్టరీ

టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్‌లోని…

3 hours ago