మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తో ఎంతో సాన్నిహిత్యం ఉన్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కేవలం ఆ కారణంగానే ఎలాంటి పారితోషికం తీసుకోకుండా గాడ్ ఫాదర్ లో స్పెషల్ క్యామియో చేసిన విషయం నెల రోజులగా వివిధ ప్రమోషన్లలో హోరెత్తిపోతూనే ఉంది. కేవలం ఈ క్యారెక్టర్ కోసమే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన హిందీ మూవీ లవర్స్ ఉన్నారు. ఒరిజినల్ లో పృథ్విరాజ్ సుకుమారన్ చేసిన పాత్రను సల్లు భాయ్ తో చేయించడం వల్ల నార్త్ మార్కెట్ కి బాగా ఉపయోగపడుతుందన్న నిర్మాతల ప్లాన్ అంతగా వర్కౌట్ అయినట్టు కనిపించడం లేదు. కారణం ఓపెనింగ్స్ కి వచ్చిన కలెక్షన్.
తెలుగు రాష్ట్రాల్లో మెగా మేనియా జోరుగా ఉన్నప్పటికీ ఉత్తరాదిలో మాత్రంగా గాడ్ ఫాదర్ ఎదురీదుతున్నట్టు ట్రేడ్ రిపోర్ట్. దేశవ్యాప్తంగా హిందీ వెర్షన్ కి కేవలం కోటి నుంచి కోటిన్నర మధ్యలో వచ్చినట్టుగా చెబుతున్నారు. సల్మాన్ ని పోస్టర్లు టీజర్ లో హై లైట్ చేస్తూ ప్రమోట్ చేసినప్పటికీ దానికి తగ్గట్టు టికెట్ కౌంటర్ల దగ్గర సందడి లేదన్నది ముంబై అప్డేట్. అయితే మౌత్ టాక్ పాజిటివ్ గా ఉన్న కారణంగా ఈ వీకెండ్ లో పికప్ అయ్యే అవకాశాలు కొట్టి పారేయలేం. బిగ్గెస్ట్ డిజాస్టర్ గా రికార్డులు సృష్టించిన లైగర్ కు ఫస్ట్ డే అయిదు కోట్లకు పైగానే నమోదు కావడం మర్చిపోకూడదు.
మొత్తానికి సల్మాన్ ఖాన్ ప్రభావం ఎంతనేది కనీసం పది రోజులు ఆగితే కానీ క్లారిటీ రాదు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం మాస్ జనానికి విక్రమ్ వేదా ఒకటే ఆప్షన్ గా ఉంది. అది కూడా యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు కానీ స్టార్ క్యాస్టింగ్, ఎలివేషన్ల వల్ల బాగానే రాబడుతోంది. పొన్నియన్ సెల్వన్ 1 వాళ్లకు కనెక్ట్ కాలేదు. సో గాడ్ ఫాదర్ కు ఇవన్నీ అనుకూలించే అంశాలే. ఈ శుక్రవారం అమితాబ్ రష్మిక మందన్నల గుడ్ బై ఒకటే స్ట్రెయిట్ రిలీజ్. ఆ నలుగురు టైపులో అదో ఎమోషనల్ డ్రామా కాబట్టి దాని వల్ల వచ్చిన ముప్పయితే లేదు. చూడాలి మరిసల్లు భాయ్ మేజిక్ ఏం చేయనుందో