ఎంతో నమ్మకం పెట్టుకుని రెమ్యునరేషన్ తగ్గించుకుని దానికి బదులుగా కొన్ని ఏరియాలు తీసుకుని మరీ రిలీజ్ చేసిన ది ఘోస్ట్ ఫలితం నాగార్జునకు ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. రివ్యూలు సోసోగా ఉన్నాయి. వెళ్లిన పబ్లిక్కే తక్కువ. దాన్నుంచి కూడా ఏమంత పాజిటివ్ రిపోర్ట్ లేకపోవడం కలెక్షన్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. గాడ్ ఫాదర్ దూకుడు దీనికి మైనస్ అయినప్పటికీ లాంగ్ వీకెండ్ కాబట్టి కంటెంట్ కనక బాగుంటే రెండింటికి థియేటర్ ఫీడింగ్ బలంగా ఉండేది. నైజామ్ షేర్ పట్టుమని కోటిలో సగం కూడా రాకపోవడం ఘోస్ట్ నిర్మాతలకు ఆందోళన కలిగించే అంశమే.
నిజానికి కింగ్ కి డేంజర్ బెల్స్ ఆఫీసర్ నుంచే మొదలయ్యాయి. దాని డిజాస్టర్ క్రెడిట్ మొత్తం రామ్ గోపాల్ వర్మ ఖాతాలో వేసినా ఆ తర్వాత ఏరికోరి చేసినా వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ లను ఆడియన్స్ ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోయారనే కోణంలో విశ్లేషణ జరగాల్సిన అవసరం చాలా ఉంది. స్టయిలిష్ యాక్షన్ మూవీస్ లోనే నాగ్ ని చూడాలని ప్రేక్షకులు కోరుకోవడం లేదు. ఆ మాటకొస్తే ఫ్యాన్స్ సైతం ఎంటర్ టైన్మెంట్ నే ఆశిస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు ఫలితాలు అందుకే బాగొచ్చాయి. అలాంటప్పుడు అవసరం లేని జానర్ ని పదే పదే ఎందుకు టచ్ చేస్తున్నారో అంతు చిక్కడం లేదు.
ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్ లాంటి కొత్త జనరేషన్ మేకర్స్ సినిమా మేకింగ్ ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నారు. వాళ్ళతో పోటీ పడాలంటే ప్రవీణ్ సత్తారు లాంటి వాళ్ళు మాములు హోమ్ వర్క్ చేస్తే సరిపోదు. కథాకథనాల విషయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ది ఘోస్ట్ లాంటి ఫలితాలు రిపీట్ అవుతూనే ఉంటాయి.ది ఘోస్ట్ మరీ బ్యాడ్ అని చెప్పలేకపోయినా కనీసం బలమైన ఓపెనింగ్స్ ఎందుకు రాలేదో చెక్ చేసుకోవాలి. బాలయ్యకు బోయపాటి శీను దొరికినట్టు నాగార్జునలో రియల్ ఎనర్జీని సరిగ్గా వాడుకుని బ్లాక్ బస్టర్ ఇచ్చే దర్శకుడు పడాలి. అది మోహన్ రాజేనా వేరొకరా అనేది కొద్దిరోజులు ఆగితే క్లారిటీ వచ్చేస్తుంది .
This post was last modified on October 6, 2022 2:25 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…