స్వాతిముత్యం అనే చిన్న సినిమాను.. గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లాంటి పెద్ద సినిమాలకు పోటీగా దసరా బరిలో నిలపడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాత్రం దసరా సీజన్‌కు సరిగ్గా సరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తమ చిత్రమని.. మార్నింగ్ షోకు గాడ్ ఫాదర్, మ్యాట్నీకి ది ఘోస్ట్ చూసే ప్రేక్షకులు ఫస్ట్ షో తమ సినిమా చూస్తారని ధీమాగా చెప్పాడు. ఆయన నమ్మకం ఏమీ వృథా కాలేదు.
ఈ సినిమాకు ప్రి రిలీజ్ బజ్ పెద్దగా లేకపోయినా.. విడుదల తర్వాత పాజిటివ్ రివ్యూలు, టాక్ ప్లస్ అయి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలుగుతోంది. తొలి రోజు ఉదయం పెద్దగా స్పందన లేకపోయినా.. సాయంత్రానికి ఈ చిత్ర వసూళ్లు పుంజుకున్నట్లే కనిపిస్తోంది. ఇక కంటెంట్ పరంగా దసరా సినిమాల్లో ది బెస్ట్ అనే స్థాయిలో సినిమా ఉండడం విశేషం. కొత్త దర్శకుడు లక్ష్మణ్ కె.కృష్ణ వీర్యదానం అనే కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ తీసుకుని.. దాన్ని చాలా సరదాగా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మెచ్చేలా డీల్ చేసిన విధానం ఆకట్టుకునేదే. సినిమా ఆరంభంలో కొంచెం నెమ్మదిగా అనిపించినా.. ఆ తర్వాత పుంజుకుని నాన్ స్టాప్ వినోదాన్ని అందించింది.
ఏదైనా సినిమాకు ఆర్టిస్టుల పరంగా ఎవరు బాగా చేశారంటే హీరో హీరోయిన్ల నుంచే చెప్పడం మొదలుపెడతాం. కానీ ‘స్వాతిముత్యం’ సినిమాకు సంబంధించి హీరో బెల్లంకొండ గణేష్, హీరోయిన్ వర్ష బొల్లమ్మల కంటే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఇందులో క్యారెక్టర్ రోల్స్ చేసిన రావు రమేష్, గోపరాజు రమణల గురించే. బెల్లంకొండ గణేష్ తొలి సినిమాకు ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకోవడం అభినందనీయమే అయినా.. అతడి పెర్ఫామెన్స్ యావరేజ్ అనిపిస్తుంది. వర్ష బొల్లమ్మ తన పాత్రలో డీసెంట్ అనిపించింది. ఐతే సినిమాలో వీరిని మించి రావు రమేష్, గోపరాజు రమణ హైలైట్ అయ్యారు. సినిమాను వాళ్లిద్దరే తమ భుజాల మీద మోశారని చెప్పొచ్చు.
గోదావరి ప్రాంతంలోని ఊర్లల్లో బాగా హడావుడి చేస్తూ, బిల్డప్ ఇచ్చే వ్యక్తులను వీళ్లిద్దరూ యాజిటీజ్ దించేశారు. రావు రమేష్ సీజన్డ్ ఆర్టిస్ట్ కాబట్టి, గతంలోనూ ఇలాంటి పాత్రలు చేశారు కాబట్టి హీరో తండ్రి పాత్ర చేయడానికి ఆయనేమీ పెద్ద కష్టపడ్డట్లు కనిపించలేదు. అలవోకగా ఆ పాత్రను చేసుకుపోయారు. తన నుంచి మాగ్జిమం ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఇక గోపరాజు రమణ అయితే సినిమాలో సర్ప్రైజ్ ప్యాకేజ్ అని చెప్పాడు. ఆ పాత్రను డిజైన్ చేసిన విధానం భలేగా అనిపిస్తుంది. సింపుల్‌గా అనిపిస్తూనే కడుపుబ్బ నవ్వించింది ఆ క్యారెక్టర్. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో అందరి దృష్టిలో పడిన రమణ.. ఈ సినిమాతో ఫుల్ బిజీ అయిపోవడం పక్కా అని చెప్పొచ్చు.
This post was last modified on October 6, 2022 2:23 pm
అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ జే. ట్రంప్ పదవీ ప్రమాణం చేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు…
స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…