Movie News

న‌య‌న్ విష‌యంలో అవ‌న్నీ రూమ‌ర్లే..!

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కేరళ నుంచి దిగుమతి అయిన అందాల భామల్లో నయనతార ఒకరు. 2003లో మలయాళ చిత్రంతో సినీ రంగ‌ప్ర‌వేశం చేసిన‌ నయన్.. ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ సౌత్ లోనే లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందింది. అదే స‌మ‌యంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. కెరీర్ ఆరంభంలో కాస్త గ్లామర్ పాత్రలు చేసినప్పటికీ.. స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత మాత్రం అందాల ఆరబోతకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటుంది.

ఇక రీసెంట్‌గా ఈ బ్యూటీ కోలీవుడ్ దర్శక నిర్మాత విగ్నేష్ శివన్‌ను వివాహం చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమాయణం కొనసాగిస్తున్న ఈ కోలీవుడ్ లవ్ బర్డ్స్ ఎట్టకేలకు జూన్ 9న మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. పెళ్లి త‌ర్వాత‌ కూడా న‌య‌న్‌ చేతి నిండా సినిమాలతో కెరీర్ పరంగా దూసుకుపోతోంది.

ఈ సంగతి ప‌క్క‌న పెడితే.. న‌య‌న‌తార రెమ్యునరేషన్ విషయంలో చాలా కఠినంగా వ్యవ‌హ‌రిస్తుందని, ఫుల్ సెటిల్మెంట్ చేశాకే షూటింగ్ ను కంప్లీట్‌ చేస్తుందని గతంలో ఎన్నో సార్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలన్నీ పుకార్లే అని తేలిపోయింది. తాజాగా నయనతార ‘గాడ్ ఫాదర్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి, తమిళ దర్శకుడు మోహన్ రాజా కాంబినేషన్‌లో తెరికెక్కిన పొలిటిక‌ల్ యాక్ష‌న్ డ్రామా ఇది. మ‌ల‌యాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’కు రీమేక్ గా రూపుదిద్దుకున్న‌ ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మించారు.

అయితే నిర్మాతల్లో ఒకరైన ఎన్వీ ప్రసాద్‌.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమాకు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. అలాగే పారితోషికం విషయంలో నయనతార ప్రవర్తించిన తీరు పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘మోహన్ రాజా వల్లే నయనతార ఈ సినిమాకు ఓకే చెప్పింది. అయితే ఫైనల్ డే షూట్ కోసం సెప్టెంబర్ లో నయనతార సెట్ లోకి వచ్చి గంటలో వర్క్ పూర్తి చేసుకుని వెళ్లిపోయింది.

నయనతారకు అప్పటికే బ్యాలెన్స్ రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి ఉన్నా.. ఆమె కానీ, ఆమె టీం కానీ దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడే నయనతార డబ్బు మనిషి కాద‌ని అర్థ‌మైంది. వర్క్ విషయంలో నయనతార చూపించే శ్రద్ధ, క్రమశిక్షణ నాకు బాగా న‌చ్చాయి’ అంటూ చెప్పుకొచ్చారు. ఈయన వ్యాఖ్యలతో రెమ్యునరేషన్ విషయంలో న‌య‌న‌తార కఠినంగా వ్యవ‌హ‌రిస్తుందనే వార్త‌లు నిజం కాద‌ని తేలిపోయింది.

This post was last modified on October 6, 2022 11:29 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

భారతీయుడు 3 భవిష్యత్తు ఏంటి?

థియేటరా ఓటిటినా అనేది పక్కనపెడితే భారతీయుడు 3 బయటికి రావడమైతే పక్కానే. కానీ గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అయితే…

5 minutes ago

పెంచలయ్య మహా ముదురు… ఇన్ని సార్లా?

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి పరకామణిలో వంద గ్రాముల బంగారు బిస్కెట్ దొంగలిస్తూ దొరికిపోయిన పెంచలయ్య వ్యవహారంలో షాకింగ్ నిజాలు…

2 hours ago

స్టార్ బక్స్… దిగి రాక తప్పలేదా?

స్టార్ బక్స్... ఈ పేరు వింటేనే కుర్రకారుకి ఓ రేంజ్ ఉత్సాహం వస్తుంది. ఎప్పుడెప్పుడు అందులోకి ప్రవేశిద్దామా అంటూ కుర్రాళ్ళు…

3 hours ago

ప‌వ‌న్ పార్ట్‌టైం కాదు.. ఫుల్ టైం లీడర్!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై గ‌తంలో వైసీపీ నాయ‌కులు చేసిన ఆరోప‌ణ‌లు ప‌టాపంచ‌లు అవుతున్నాయి. గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ…

3 hours ago

ఫ్యాన్ వార్ చేసే అభిమానులకు అజిత్ చురకలు

సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరిగాక అభిమానుల్లో హీరోయిజం పిచ్చి ముదిరి పాకాన పడుతోంది. ఒకప్పుడు రిలీజ్ రోజు హడావిడితో…

4 hours ago

ప‌గ్గాలు కేటీఆర్‌కేనా? బీఆర్‌ఎస్‌లో హాట్ టాపిక్‌!

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ పార్టీ ప‌గ్గాల వ్య‌వ‌హారం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. పార్టీ అధినే త కేసీఆర్…

4 hours ago