ఇండస్ట్రీలో ఎంతలేదన్నా లక్ ఫ్యాక్టర్ బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా డెబ్యూ సినిమాలు చేసేటప్పుడు టాలెంట్ ఎంత ఉన్నా దానికి లక్ తోడావ్వల్సిందే. ఇప్పుడు కుర్ర హీరో గణేష్ బెల్లంకొండ కి లక్ కలిసొచ్చిందని చెప్పాలి. అప్పుడెప్పుడో గణేష్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో ఓ సినిమా మొదలైంది. షూట్ మొదలైన కొన్ని రోజులకే ఆ సినిమా ఆగిపోవడంతో గణేష్ సితార బేనర్ లో లక్ష్మణ్ అనే కొత్త దర్శకుడితో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. అదే స్వాతి ముత్యం. కథను నమ్మి తన డెబ్యూ సినిమాను లక్ష్మణ్ తో చేశాడు గణేష్.
దసరా సీజన్ లో ఇటు చిరు ‘గాడ్ ఫాదర్’ అటు నాగ్ ‘ది ఘోస్ట్’ పోటీ పడుతుంటే మధ్యలో స్వాతి ముత్యం చేరింది. రిలీజ్ డేట్ ప్రకటించగానే ఈ చిన్న సినిమా పెద్ద సినిమాల మధ్య నలిగిపోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ స్వాతి ముత్యం కొన్నేళ్ళ క్రితం వచ్చిన శతమానం భవతి సినిమాను గుర్తుచేసింది. అవును ఇటు చిరు ‘ఖైది నెంబర్ 150’ అటు బాలయ్య ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ ల నడుమ సంక్రాంతి కానుకగా విడుదలైన శతమానం భవతి సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని రోజు రోజుకి వసూళ్ళు పెంచుకుంటూ దూసుకెళ్ళింది. సరిగ్గా ఇప్పుడు స్వాతి ముత్యం విషయంలో కూడా అదే రిపీట్ అయింది. ఒకరోజు ముందే ప్రీమియర్ షో పడటంతో సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఇవ్వాళ ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం కనిపిస్తుంది.
దసరా సీజన్ లో పర్ఫెక్ట్ ఫ్యామిలీ సినిమా అనే ట్యాగ్ అందుకోవడంతో స్వాతి ముత్యం కి బుకింగ్స్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ రెండు మూడు రోజులు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వస్తే కలెక్షన్ల పరంగా సూపర్ హిట్టయినట్టే. ఏదేమైనా మొదటి సినిమా ఆగిపోవడం ఈ సినిమా డెబ్యూ మూవీగా రిలీజ్ అవ్వడం పైగా రెండు బడా సినిమాల మధ్య సూపర్ హిట్ టాక్ అందుకోవడం ఇవన్నీ గమనిస్తే బెల్లంకొండ గణేష్ లక్కీ హీరో అనిపిస్తుంది.
This post was last modified on October 5, 2022 2:57 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…