కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసే ‘అన్ స్టాపబుల్’ టాక్ షో రెండో సీజన్లో ఒక ఎపిసోడ్‌కు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిథిగా రాబోతున్నాడు. బహుశా రెండో సీజన్ ఈ ఎపిసోడ్‌తోనే మొదలవుతుండొచ్చు. చంద్రబాబు ఈ షోలో పాల్గొన్న విషయాన్ని సస్పెన్స్‌లాగా ఏమీ టీం దాచి పెట్టట్లేదు. ఇంకా షో మొదలవడానికి ముందే.. షూట్ టైం నుంచే హడావుడి మొదలుపెట్టేసింది.
చంద్రబాబు ఈ షోలో పాల్గొన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. చంద్రబాబు స్వయంగా ఆహా అధినేత అల్లు అరవింద్‌తో ఫాటు ఓటీటీ ప్రధాన సిబ్బంది అందరూ కలిసి మరీ స్వాగతం పలికారు. బాలయ్య-బాబు కలిసి ఈ షోలో బాగానే సందడి చేసినట్లు కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
షో గెస్ట్ సీట్లో కూర్చునే ముందు చంద్రబాబు ప్రేక్షకులకు అభివాదం చేయడం.. వాళ్లు సీఎం సీఎం అని ఆడిటోరియాన్ని హోరెత్తించడం వీడియోలో కనిపిస్తోంది. తెలుగుదేశం మద్దతుదారులకు ఈ వీడియో మామూలు కిక్కు ఇవ్వట్లేదు. చంద్రబాబు స్థాయికి ఓటీటీలో ప్రసారం అయ్యే ఒక టాక్ షోలో పాల్గొనాల్సిన అవసరం ఉందా అని కొందరికి అనిపించొచ్చు కానీ.. ఇలాంటి సూపర్ హిట్ షోలో పాల్గొనడం వల్ల యూత్‌కు బాగానే కనెక్ట్ అయ్యే అవకాశముంది.
‘అన్ స్టాపబుల్’ ఫస్ట్ సీజన్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. మామూలుగా పొలిటికల్ ఇంటర్వ్యూలు, ప్రసంగాలు అంటే వేరు కానీ.. ఇలాంటి షోకు వచ్చి వ్యక్తిగత విషయాలు పంచుకుని సరదాగా గడిపితే చంద్రబాబులోని మరో కోణం జనాలకు తెలుస్తుంది. ఎక్కువమంది అటెన్షన్ లభిస్తుంది. అంతిమంగా పొలిటికల్ ప్రమోషన్‌కూ ఈ షో బాగానే ఉపయోగపడుతుంది. ఇది బాలయ్య-బాబు కలిసి ఇస్తున్న మాస్టర్ స్ట్రోక్‌గా భావించవచ్చు.
This post was last modified on October 4, 2022 6:11 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…