టాలీవుడ్లో మరో టాప్ స్టార్ 100 సినిమాల మైలురాయికి చేరువ అయ్యాడు. ఆయనే.. అక్కినేని నాగార్జున. తన వందో సినిమా గురించి ఆయన గత కొన్నేళ్ల నుంచి మాట్లాడుతున్నాడు. ఇటీవల ఈ సినిమా కోసం నలుగురు దర్శకులు పరిశీలనలో ఉన్నారని.. అందరితోనూ కథా చర్చలు జరుగుతున్నాయని నాగ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఐతే ఈ నలుగురిలో ఒక పేరు మాత్రం ముందు నుంచి బలంగా వినిపిస్తోంది. అతనే.. మోహన్ రాజా. సీనియర్ ఎడిటర్, నిర్మాత, తెలుగువాడు అయిన మోహన్ కొడుకే ఈ మోహన్ రాజా. తమిళంలో చాలా వరకు రీమేక్ సినిమాలతోనే విజయాలందుకున్న మోహన్ రాజా.. స్ట్రెయిట్ సినిమాలైన ‘తనీ ఒరువన్’, ‘వేలైక్కారన్’ సినిమాలతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’తో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నాడు మోహన్ రాజా. ఇంతకుముందు అతను ‘హనుమాన్ జంక్షన్’ అనే రీమేక్ మూవీతోనే తెలుగులో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
కాగా ‘గాడ్ ఫాదర్’ విడుదల ముంగిట మీడియాతో మాట్లాడిన జయం రవి.. తెలుగులో తన తర్వాతి సినిమా అక్కినేని నాగార్జునతో ఉండొచ్చని సంకేతాలు ఇచ్చాడు. నాగ్‌తో ఒక యాక్షన్ మూవీ చేయాలనుకుంటున్నానని.. ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయని వెల్లడించాడు.
దీన్ని బట్టి చూస్తే నాగ్ 100వ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించే అవకాశాలు మెండుగానే ఉన్నాయన్నమాట. మరి ఈ ప్రాజెక్టు మీద పూర్తి క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా.. ‘లూసిఫర్’ను రీమక్ చేసి మళ్లీ ఆ చిత్రాన్ని మలయాళంలో రిలీజ్ చేయడం ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై చాలా ట్రోలింగ్ కూడా జరుగుతోంది. దీని గురించి మోహన్ రాజా దగ్గర ప్రస్తావించగా.. ‘లూసిఫర్’తో పోలిస్తే ‘గాడ్ ఫాదర్’లో చాలా మార్పులు చేర్పులు జరిగాయని, సినిమాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దామని.. అందుకే దీన్ని మలయాళంలో కూడా రిలీజ్ చేస్తున్నామని మోహన్ రాజా వెల్లడించాడు.
This post was last modified on October 6, 2022 11:36 am
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…