‘బాహుబలి’ ప్రభాస్ కొత్త సినిమా, ఆదిపురుష్ టీజర్ ఆల్రెడీ రిలీజై ఒక వర్గాన్ని భారీగా అప్సెట్ చేసింది. నాసిరకం గ్రాఫిక్స్ తో ఇదొక టెంపుల్ రన్ గేమ్ తరహాలో ఉందని.. వానరసైన్యం సీన్లన్నీ అచ్చం ప్లానెట్ ఆఫ్ ఏప్స్ సినిమాలో చూసి తక్కువ క్వాలిటీతో రీమేక్ చేసినట్లున్నాయ్ అందరూ ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాదు, సాక్షాత్తూ రామాయణం తీశామని చెబుతున్నప్పుడు.. ప్రభాస్ పోషించిన రాముడి పాత్ర నీలంగానూ, అలాగే సైఫ్ ఆలీ ఖాన్ చేసిన రావణాసురుడి పాత్ర లుక్స్ విషయంలో శివ భక్తుడిగానూ చూపించకపోవడం దారుణం అంటున్నారు.
ఈ తరుణంలో మరో రూమర్ కూడా ఆదిపురుష్ ఫ్యాన్స్ కు షాకిస్తోంది. సలార్ సినిమా షూట్ కంటే ముందు ప్రభాస్ చాలా బొద్దుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ పోస్టర్లలో సినిమాలో కూడా ఆ విషయం కనిపిస్తోంది. అయితే ట్రైలర్లో చూసినప్పుడు మాత్రం ఆ బల్క్ బాడీలో ఉన్న ప్రభాస్ కు సిక్స్ ప్యాక్ యాబ్స్ ఉన్నట్లు చూపించారు. అప్పట్లో సల్మాన్ ఖాన్ కోసం సుల్తాన్, ఏక్తా టైగర్ వంటి సినిమాల్లో ఎలాగైతే కండలవీరుడి బుజ్జి పొట్టను తొలిగించి ఆ స్థానంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ సాయంతో సిక్స్ ప్యాక్ తగిలించేశారో ఇప్పుడు ప్రభాస్ కూడా అదే తరహాలో యాడ్ చేశారనే కామెంట్స్ అందుకే వినిస్తున్నాయి.
ఇకపోతే రాముడి పాత్రను పోషించిన దాదాపు హీరోలందరూ పైవస్త్రం ఏదీ ధరించకుండానే కనిపించారు. ఎన్టీఆర్ నుండి శోభన్ బాబు, బాలయ్య వరకు.. అందరూ అదే తరహాలో కనిపించి అలరించారు. కాని ప్రభాస్ మాత్రం కొన్ని సీన్స్ లో టాప్ ఒకటి వేసుకోవడం చూస్తుంటే.. అన్ని సీన్స్ లో సిక్స్ ప్యాక్ యాడ్ చేయడం కుదరదనే.. అలా మ్యానేజ్ చేశారా అని కూడా అనిపిస్తోంది. ఏదేమైనా కూడా, సాహో మరియు రాధే శ్యామ్ సినిమాలు రిలీజయ్యాక ట్రోలింగ్ కు గురైతే, ఆదిపురుష్ మాత్రం పోస్టర్ అండ్ టీజర్ రిలీజుతోనే ట్రోలర్లకు నోటినుండి ఫుడ్డు చేతినిండా పని పెట్టినట్లయ్యింది.
This post was last modified on October 3, 2022 6:43 pm
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…