దసరాకు గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లాంటి పెద్ద సినిమాలకు పోటీగా బరిలోకి దిగుతున్న చిన్న సినిమా.. స్వాతిముత్యం. అంత పెద్ద సినిమాలకు పోటీగా ఒక కొత్త హీరో నటించిన చిన్న సినిమాను రిలీజ్ చేయడానికి కారణం.. తమ చిత్రం మీద ఉన్న నమ్మకమే అంటున్నాడు నిర్మాత నాగవంశీ. దసరా సీజన్‌కు తగ్గ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్వాతిముత్యం అని అతను చెబుతున్నాడు.
కాగా స్వాతిముత్యం ట్రైలర్ చూస్తే ఫన్నీగా అనిపించింది కానీ.. అసలు ఈ సినిమా కథేంటన్నది అర్థం కాలేదు. హీరోకు ఏదో ఒక సమస్య ఉందని చెప్పారు కానీ.. అదేంటో వెల్లడించలేదు. దాన్నో సస్పెన్స్ లాగా దాచిపెట్టారు. కథ మలుపు తిరిగేది ఆ పాయింట్ మీదే అనిపించింది ట్రైలర్ చూస్తే. ఐతే సినిమా రిలీజయ్యే వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఆ సీక్రెట్ ఏంటో చెప్పేశాడు నాగవంశీ.
ఈ చిత్రంలో హీరో వీర్య దాతగా కనిపించనున్నాడట. అతడి పెళ్ళికి అదే సమస్యగా మారుతుంది. అక్కడే కథ మలుపు తిరుగుతుంది. హీరో వీర్య దాత అనగానే అందరికీ హిందీ బ్లాక్‌బస్టర్ విక్కీ డోనర్‌యే గుర్తుకు వస్తుంది. ఆయుష్మాన్ ఖురానాను స్టార్‌ను చేసిన సినిమా అది. ఆ టైంకి వీర్య దానం మీద సినిమా అంటే అందరూ ఆశ్చర్యపోయారు. దీన్ని ప్రేక్షకులు తట్టుకోగలరా అనుకున్నారు. కానీ ఆ కాన్సెప్ట్‌ను వల్గారిటీ లేకుండా నీట్‌గా, హృద్యంగా, వినోదాత్మకంగా చూపించి ప్రేక్షకులను మెప్పించారు. బ్లాక్‌బస్టర్ విజయాన్నందుకున్నారు.
ఐతే ఇదే చిత్రాన్ని తెలుగులో సుమంత్ హీరోగా నరుడా డోనరుడా పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడ డిజాస్టర్ అయింది. ఆ సినిమా గురించి జనాలకు పెద్దగా తెలియదు కాబట్టి.. ఇప్పుడు మళ్లీ ధైర్యం చేసి వీర్య దానం నేపథ్యంలో కామెడీ మూవీ తీసినట్లున్నారు. మరి ఈ పాయింట్‌ను దర్శకుడు ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేశాడో, సినిమా ఏమేర ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. ఈ నెల 5న స్వాతిముత్యం ప్రేక్షకులను పలకరించనున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 2, 2022 9:16 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…