కొరటాల ఒక్కడినే బ్లేమ్ చెయ్యడం కరక్టేనా?

Koratala

ఇప్పటివరకు ఇన్ డైరక్టుగా పంచులేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఏకంగా డైరక్టుగా.. సూటిగా సుత్తిలేకుండా ఒక పాయింట్ చెప్పేశారు. ‘ఆచార్య’ సినిమా విషయంలో డైరక్టర్ చెప్పిందే చేశామని, కాబట్టి ఆ ఫెయిల్యూర్ తనను బాధిందచని కామెంట్ చేశారు. కాకపోతే రామ్ చరణ్‌ తో చేసిన మొదటి సినిమానే ఫెయిలైందంటే.. మరో సినిమా చేసినప్పుడు ఆ ఎక్సయిట్మెంట్ ఉండదని తేల్చి చెప్పారు. అయితే ఇక్కడ ఒక వర్గం ఆడియన్స్ అడుగుతుందేంటంటే.. చిరంజీవి స్థాయి స్టార్ హీరో కేవలం డైరక్టర్ ఒక్కడిదే తప్పు అనడం సబబేనా?

నిజానికి సినిమా సూపర్బ్ గా ఆడాలంటే ముందుగా అదిరిపోయే సాంగ్స్ ఉండాలి. ఎప్పుడూ దేవిశ్రీప్రసాద్ తో వెళ్ళే కొరటాల శివను ఈసారి మణిశర్మను తీసుకోమని చెప్పడమే పెద్ద నెగెటివ్ అయ్యింది. ఒక్క పాటలో కూడా సరైన పస లేదు. అదే విధంగా అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్లతో విరుచుకుపడే తమన్ ను కూడా తీస్కోకుండా, అవుటాఫ్‌ ఫామ్ లో ఉన్న మణితో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా కొట్టించడం సినిమాకు ఇంకా మైనస్సే. ఇవన్నీ కూడా కొరటాల శివ తీస్కున్న డెసిషన్సేనా? అంతే కాదు, చిరంజీవి స్వయంగా స్ర్కిప్ట్ ను చూస్కుంటారు కాబట్టి, అసలు మరీ అంత గుడ్డిగా కొరటలా శివ రాసిన పేలవమైన అవుడ్డేటెడ్ కథను ఎలా నమ్మరనేదే అసలు పాయింట్. చరణ్‌ అండ్ చిరు ఒక ఫ్రేములో కనిపిస్తారు అనే సింగిల్ పాయింట్ కు ఎక్సయిటయిపోయి కథను ఓకే చేసిన చిరంజీవిది కూడా ఈ విషయంలో తప్పేకదా అంటూ కొందరు మూవీ లవ్వర్స్ కామెంట్ చేస్తున్నారు.

నిజానికి ఆచార్య సినిమా ఫ్లాపైదంటే దానికి కొరటాల శివ ఒక 70% కారణం అయితే పక్కాగా మెగాస్టార్ కూడా ఒక 30% కారణం అనే చెప్పొచ్చు. అయితే హిట్లొచ్చినప్పుడు హీరోలను పొగిడి, ఫ్లాప్ రాగానే డైరక్టర్లను తిట్టే ఫ్యాన్స్ ఉన్నంత కాలం స్టార్ హీరోలు కూడా అదే తరహాలో కామెంట్ చేస్తున్నారే అనే మాట ఇప్పుడు సర్వత్ర వినబడుతోంది. ఈ సమయంలో.. చిరంజీవైనా కొరటాలైనా తమ గొప్పతనాన్ని చాటుకోవాలంటే మాత్రం.. ఇటు గాడ్ ఫాదర్ తో మెగాస్టార్ అటు #ఎన్టీఆర్30తో కొరటాల హిట్లు కొట్టి చూపించాల్సిందే. చూద్దాం ఏమవుతుందో.