ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరికీ ఉన్న బిగ్ క్వశ్చన్ సురేష్ బాబు పరిశ్రమ సమస్యల్లో ఎందుకు కనిపించడం లేదు ? అవును దగ్గుబాటి సురేష్ బాబు గత కొన్ని రోజుల నుండి ఇండస్ట్రీకి సంబంధించి ఏ విషయంలోనూ జోక్యం చూపడం లేదు. మీడియా ముందుకు కనిపించటం లేదు. అసలు సురేష్ బాబు కి ఏమైంది ? నారప్ప , దృశ్యం 2 సినిమాల ప్రమోషన్స్ లో బాగా ఆక్టివ్ గా కనిపించి ప్రమోషన్స్ తో పాటు పరిశ్రమ గురించి ఇంటర్వ్యూలలో మాట్లాడిన ఆయన ఉన్నపళంగా ఎందుకు సైలెంట్ అయుపోయారు ? అసలేం జరిగింది ? ఇవన్నీ డౌట్లకు తొందర్లోనే ఆన్వర్ రానుంది.
సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరాం హీరోగా పరిచయం అవుతున్న ‘అహింస’ సినిమా నవంబర్ లో రిలీజ్ అవ్వబోతుంది. దసరా కి టీజర్ రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా టీం మీడియా ముందుకు రాబోతుంది. ఓ ఈవెంట్ ప్లాన్ చేసి టీజర్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్స్ లో సురేష్ బాబు కనిపించడం ఖాయం. కొడుకు డెబ్యూ సినిమా గురించి ఆయన మీడియా ముందుకు వచ్చి కంటెంట్ గురించి ఎలాగో చెప్పకనే చెప్పాలి. అలా కనిపించిన వెంటనే సురేష్ బాబు కి మీడియా నుండి ఉన్నపళంగా ఎందుకు సైలెంట్ అయిపోయారు అనే ప్రశ్న ఎదురవుతుంది.
మరి ఆ ప్రశ్నకి సురేష్ బాబు ఎలాంటి ఆన్సర్ ఇస్తాడో ఇండస్ట్రీ విషయాల గురించి ఏం చెప్తారో చూడాలి. సో ఇన్ని రోజులు ఇండస్ట్రీ సమస్యలలో పెద్దగా కనిపించకుండా అలాగే మీడియా ముందుకు రాకుండా ఉన్న సురేష్ బాబు ఎట్టకేలకు అభిరాం అహింస కోసం బయటికి రాక తప్పదు. అలా వచ్చాక అన్నిటి గురించి మాట్లాడక తప్పదు. చూడాలి సురేష్ బాబు మీడియాతో ఏం చెప్తారో ?
This post was last modified on October 1, 2022 10:06 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…