ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలా ఎదుగుతారో ఎలాంటి అద్బుతాలు సృష్టిస్తారో చెప్పలేం. తాజాగా ఓ కమెడియన్ కూడా సినిమా జనాలకు అలాంటి షాక్ ఇచ్చాడు. ఒక సినిమా డైరెక్ట్ చేసేసి రిలీజ్ కి రెడీ చేస్తూ అందరినీ సర్ ప్రయిజ్ చేస్తున్నాడు. ఆ కమెడియన్ మరెవరో కాదు నల్ల వేణు.
నటుడుగా వేణు చాలానే సినిమాలు చేశాడు. ముఖ్యంగా తేజ సినిమాల్లో ఎక్కువగా కనిపించేవాడు. ప్రభాస్ మున్నా లో అతనికి మంచి పాత్ర దక్కింది. ప్రభాస్ వెంటే ఉంటూ ఇలియానా ని ప్రేమించే సన్నివేశాల్లో మంచి కామెడీ పండించాడు. ఆ తర్వాత కమెడియన్ కొన్ని సినిమాలు చేసినా ఆ రేంజ్ పాత్రలు దక్కలేదు. అందుకే ఓ కథ రాసుకొని దర్శకుడిగా మారిపోయాడు.
వేణు మెగా ఫోన్ పట్టడానికి మెయిన్ రీజన్ దిల్ రాజు. అవును కథ నచ్చడంతో దిల్ రాజు రంగంలోకి దిగి ఈ సినిమాను నిర్మించారట. ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తెలంగాణా నేపథ్యంలో ఆత్మహత్యల మీద వేణు ఈ సినిమా తీసినట్టు తెలుస్తుంది. ఇంకా కాస్టింగ్ వివరాలు బయటికి రాలేదు కానీ దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ కి అడిగినవన్నీ సమకూర్చారని తెలుస్తుంది.
త్వరలోనే ఫస్ట్ లుక్ ఆ తర్వాత్ సాంగ్ రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉంది టీం. మరి కామెడీ పాత్రలకు గుడ్ బై చెప్పేసి మెగా ఫోన్ పట్టేసిన వేణు ఈ సినిమాతో దర్శకుడిగా మెప్పిస్తే డైరెక్టర్ గా మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. సీరియస్ కథ కాబట్టి ఏ మాత్రం క్లిక్ అయినా అవార్డులు కూడా దక్కుతాయి. మరి దర్శకుడిగా వేణు స్టార్ ఎలా ఉందో చూడాలి.
This post was last modified on October 1, 2022 2:11 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…