Movie News

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏం మెయింటైన్ చేస్తున్నాడ‌బ్బా


ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌య‌సు ఇప్పుడు 51 ఏళ్లు. ఆయ‌నకు సినిమాల మీద పూర్తి ఫోక‌స్ ఏమీ లేదు. ప్ర‌ధానంగా రాజ‌కీయాల మీదే దృష్టిపెట్టాడు. వీలు చిక్కిన‌పుడు సినిమాలు చేస్తున్నాడు. అయిన‌ప్ప‌టికీ ఫుల్ టైం సినిమాలు చేసే, ఫిట్నెస్-అందం మీద ఎంతో ఫోక‌స్ పెట్టే హీరోల‌ను మించి ఈ వ‌య‌సులో ప‌వ‌న్ మెయింటైన్ చేస్తున్న గ్లామ‌ర్ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. త‌న‌కంటే వ‌య‌సులో త‌క్కువ ఉన్న హీరోల‌ను మించిన ఛార్మ్ ప‌వ‌న్‌లో క‌నిపిస్తోందిప్పుడు.

తాజాగా పెండింగ్‌లో ఉన్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా కొత్త షెడ్యూల్ మొద‌లుపెట్ట‌డం కోసం ముందుగా నిర్వ‌హిస్తున్న వ‌ర్క్ షాప్‌లో పాల్గొంటున్నాడు ప‌వ‌న్. దీనికి సంబంధించి ఒక వీడియోను చిత్ర బృందం షేర్ చేసింది. అందులో ప‌వ‌న్ ముఖంలో గ్లో చూసి అంద‌రూ షాకైపోయారు.

కెరీర్లో వెన‌క్కి వెళ్లి పాత రోజుల‌ను గుర్తు తెచ్చుకునేలా ఉంది ప‌వ‌న్ లుక్. లైట్‌గా గ‌డ్డం పెంచి, కాస్త జులపాల జుట్టుతో చాలా ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాడు ప‌వ‌న్ కొత్త లుక్‌లో. ప‌వ‌న్ వేసుకున్న జీన్స్, టీష‌ర్ట్ సింపుల్‌గా అనిపిస్తూనే.. చాలా ట్రెండీగా ఉండ‌డంతో ఈ ఫొటోల‌ను అభిమానులు సోష‌ల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. వాటినే డీపీలుగా మార్చుకుంటున్నారు. 51 ఏళ్ల‌లో ప‌వ‌న్ మెయింటైన్ చేస్తున్న ఫిట్నెస్, అందం చూసి వేరే హీరోలు అసూయ చెందుతుంటే ఆశ్చ‌ర్యం లేదు అనిపించేట్లుగా ఉన్నాయి అత‌డి ఫొటోలు.

హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుకు సంబంధించి అప్‌డేట్ ఇవ్వ‌డం అభిమానులకు ఒక ఆనంద‌మైతే.. ప‌వ‌న్ ఇంత ఆక‌ర్ష‌ణీయ‌మైన లుక్‌లో క‌నిపించ‌డం వారి ఆనందాన్ని ఇంకా పెంచుతోంది. మ‌రి కొన్ని రోజుల్లోనే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు కొత్త షెడ్యూల్ మొద‌లు కాబోతోంది. మరి సినిమాలో ప‌వ‌న్ ఇంకెంత అందంగా క‌నిపిస్తాడో చూడాలి.

This post was last modified on October 1, 2022 11:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పాత వ్యూహమే: ఎమ్మెల్సీ ఎన్నికలకు గులాబీ పార్టీ దూరం

కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…

3 minutes ago

స్కూటర్ మీద 311 కేసులు.. రూ.1.6లక్షల ఫైన్!

ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…

6 minutes ago

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

3 hours ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

3 hours ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీకి డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

14 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

15 hours ago