టాలీవుడ్లో దసరా సినిమాల లైనప్ ఖరారైపోయింది. గాడ్‌ఫాదర్, ది ఘోస్ట్, స్వాతిముత్యం చిత్రాలు పండక్కి ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. ఆ తర్వాతి వారం డ్రై రన్ చూడబోతున్నాం. మళ్లీ దీపావళి ముంగిట సందడి నెలకొనబోతోంది. అక్టోబరు 21కి వరుసగా ఒక్కో సినిమా బెర్తు బుక్ చేసుకుంటోంది. ఇప్పటికే తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ‘ప్రిన్స్’ మూవీ దీపావళికి ఫిక్సయింది. శివకార్తికేయన్-అనుదీప్ కేవీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం చాలా ముందుగానే రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. ఈ మధ్యే విశ్వక్సేన్ సినిమా ‘ఓరి దేవుడా’ను కూడా దీపావళి రేసులో నిలబెట్టిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు దీపావళి రేసులోకి మరో సినిమా వచ్చింది. అదే.. జిన్నా. మంచు విష్ణు హీరోగా సూర్యా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబరు 21నే విడుదల చేయబోతున్నట్లు గురువారం రాత్రి ట్విట్టర్ ద్వారా మంచు విష్ణు వెల్లడించాడు.
‘జిన్నా’ను ముందు దసరాకే రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఐతే ఆ పండక్కి పోటీ ఎక్కువైపోవడంతో వెనక్కి తగ్గారు. మంచు విష్ణు కెరీర్లో ‘జిన్నా’ చాలా కీలకమైన చిత్రం. అతడి గత చిత్రాలు దారుణమైన ఫలితాలందుకున్నాయి. చివరగా విష్ణు నుంచి వచ్చిన ‘ఓటర్’ ప్రేక్షకుల దృష్టిలో పడకుండానే వెళ్లిపోయింది. అంతకుముందు ‘ఆచారి అమెరికా యాత్ర’ సైతం దారుణమైన ఫలితాన్నందుకుంది. దీంతో విష్ణు కొంత కాలం సినిమాలు చేయడమే మానేశాడు.
ఈ గ్యాప్ తర్వాత తనకు ‘దేనికైనా రెడీ’ లాంటి హిట్ ఇచ్చిన నాగేశ్వరరెడ్డి కథతో సూర్యా అనే కొత్ద డైరెక్టర్ దర్శకత్వంలో ‘జిన్నా’ చేశాడు. ఈ చిత్రానికి కోన వెంకట్ రచనా సహకారం అందించడం విశేషం. ఎప్పట్లాగే విష్ణు తన సొంత బేనర్లో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. విష్ణు సరసన ఇందులో సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ నటించారు. ఈ చిత్రంలో విష్ణు సప్లయర్స్ యజమానిగా నటించాడు. దీని టీజర్ చూస్తే ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది.
This post was last modified on September 30, 2022 8:55 am
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
తెలంగాణ పల్లె గీతాలకు ఆణిముత్యమైన జానపద గాయకుడు మొగిలయ్య ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…