కోలీవుడ్ మొత్తం బాహుబలి రేంజ్ లో అంచనాలు పెట్టుకున్న పొన్నియన్ సెల్వన్ 1తో పోటీకి సిద్ధపడ్డ ధనుష్ కొత్త సినిమా నేనే వస్తున్నా మీద అభిమానులకు తప్ప సదరు ప్రేక్షకుల్లో ఎలాంటి ఆసక్తి కనిపించలేదు. కారణం చాలా వీక్ గా జరుపుకున్న ప్రమోషన్లు. తెలుగులో గీత ఆర్ట్స్ పంపిణి చేసినప్పటికీ పబ్లిసిటీ సోసోగానే అనిపించింది. ఏదైతేనేం మొత్తానికి థియేటర్లలో అడుగు పెట్టింది. ధనుష్ ఫ్యాన్స్ తో పాటు దర్శకుడు సెల్వ రాఘవన్ టేకింగ్ ని సీరియస్ గా ఇష్టపడేవాళ్లు ఈ ఇద్దరి కోసమే టికెట్లు కొని వెళ్లారు. అయితే వాళ్ళ నమ్మకం పూర్తి స్థాయిలో నిలబెట్టుకోలేకపోవడం ట్రాజెడీ.
ఎప్పుడో 2001లో కమల్ హాసన్ అభయ్ వచ్చింది. అందులో హీరో పాత్ర కవలలు అంటే డ్యూయల్ రోల్. ఒకటి శాడిస్టిక్ కిల్లర్ అయితే రెండోది పోలీస్ ఆఫీసర్. అప్పట్లో డిజాస్టరే కానీ కాలక్రమేణా దీన్ని ఇష్టపడేవాళ్లు ఎక్కువ కావడంతో మెల్లగా కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ఈ నేనే వస్తున్నాకి బేసిక్ స్ఫూర్తి ఇక్కడి నుంచే తీసుకున్నారు సెల్వ. చిన్నప్పుడే సైకో ప్రవర్తన వల్ల కథిర్(ధనుష్)తో తెగతెంపులు చేసుకుంటాడు ప్రభు(ధనుష్). పెద్దయ్యాక తన కూతురికి దెయ్యడం పట్టడం వెనుక కవల సోదరుడు ఉన్నాడని తెలుసుకుని అతని అంతు చూసేందుకు రెడీ అవుతాడు. ఆ తర్వాత జరిగేది ఇక్కడ చెబితే బాగుండదు.
హాలీవుడ్ మూవీస్ లో మాత్రమే కనిపించే టిపికల్ లైన్ ని తీసుకున్న సెల్వ రాఘవన్ మొదటి సగం కథా కథనాలు కొంత అటుఇటు జరిగినా ఈ జానర్ ని ఇష్టపడే ప్రేక్షకులను మెప్పించేలానే సాగించాడు. ఇంటర్వెల్ బ్లాక్ తో పర్లేదు బాగానే ఉందనే ఫీలింగ్ కలిగిస్తాడు. ఒక్కసారి సెకండ్ హాఫ్ మొదలయ్యాక మొత్తం శృతితప్పి దారీతెన్ను లేని సన్నివేశాలతో, తీవ్రంగా నిరాశపరిచే క్లైమాక్స్ తో ఉసూరుమనిపిస్తాడు. అక్కడ నుంచి కథిర్ యాంగిల్ నుంచే స్టోరీ నడిపించడంతో ప్రభు క్యారెక్టర్ వీకైపోయి ఆడియన్స్ బ్యార్ మంటారు. యువన్ సంగీతం జస్ట్ ఓకే. ఫైనల్ గా సినిమా హారర్ కి థ్రిల్లర్ మధ్యలో ఊగిసలాడి చివరికి దభాలున కింద పడిపోయింది.
This post was last modified on September 29, 2022 10:25 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…