ఇటీవలే శాకుంతలం విడుదల తేదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తామని నిర్మాతలు ఘనంగా అనౌన్స్ చేశారు. ఇంతలో ఏమయిందో కానీ ఉన్నట్టుండి ఇవాళ 3D వెర్షన్ కోసం వాయిదా వేస్తున్నామని, అన్నీ పనులు కాగానే కొత్త డేట్ ఫైనల్ చేస్తామని సోషల్ మీడియాలో చల్లగా చెప్పేశారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పుడు దర్శక నిర్మాత గుణశేఖర్ ఎక్కడా ఇది త్రీడిలో చేసే ఆలోచన ఉందని మాటవరసకు కూడా అనలేదు. ఇప్పుడు ఇంత సడన్ గా నిర్ణయం ఎందుకు మార్చుకున్నారనే అనుమానం రావడం సహజం.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం దీని వెనుక పలు కోణాలు కనిపిస్తున్నాయి. మొదటిది సమంతా అందుబాటులో లేకపోవడం. వ్యక్తిగత కారణాల వల్ల ఓ రెండు నెలలు బ్రేక్ తీసుకుందనే వార్త వారాల క్రితమే ప్రచారంలోకి వచ్చింది. దాని ఖండిస్తూ సామ్ ఎలాంటి ట్వీట్ చేయలేదు. మరోపక్క విజయ్ దేవరకొండ ఖుషిని అందుకే పెండింగ్ లో ఉంచారనే న్యూస్ ప్రచారమయ్యింది. ఆ యూనిట్ సైతం సైలెంట్ గానే ఉండిపోయింది. ఒకవేళ శాకుంతలంని నవంబర్ అనుకుంటే ప్రమోషన్లు చేసే టైంలో సామ్ లేకపోతే చాలా ఇబ్బందవుతుంది. అసలు ఆ మూవీని మార్కెటింగ్ చేస్తోందే తన పేరు మీద.
నిజానికి త్రీడి టెక్నాలజీలో సినిమా తీయాలంటే ముందగానే ప్రిపేర్ అవ్వాలి తప్పించి అప్పటికప్పుడు చేసేది కాదు. రుద్రమదేవికి అప్పట్లో త్రీడి జోడించారు కానీ అదేమంత గొప్పగా అనిపించలేదనే కామెంట్స్ వచ్చాయి. శాకుంతలం బాహుబలిలాగా కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ డిమాండ్ చేసే సబ్జెక్టు కాదు. అలాంటప్పుడు గుణశేఖర్ ట్రెండ్ కు అనుగుణంగా ఈ ఆలోచన చేశారా లేక పైన చెప్పినట్టు సామ్ పబ్లిసిటీకి అందుబాటులోకి వచ్చాక ఫైనల్ చేద్దామనుకున్నారా వేచి చూడాలి. డిసెంబర్, జనవరిలు క్రేజీ సినిమాలు, ప్యాన్ ఇండియాలతో ప్యాకవుతోంది. మరి శాకుంతలంకు స్పేస్ ఎక్కడ దొరికెనో.
This post was last modified on September 29, 2022 7:54 pm
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…