ఏళ్ళ తరబడి స్క్రిప్ట్ రాసి షూటింగ్ చేసి విడుదల కోసం రెండు సంవత్సరాలకు పైగా ఎదురు చూసిన లాల్ సింగ్ చడ్డా అమీర్ ఖాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగలడమే కాదు బాలీవుడ్ బయ్యర్లకు ఇప్పుడప్పుడే మర్చిపోలేని పీడకలగా మిగిలిపోయింది. నష్టాలను కొంత వరకు భర్తీ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి కానీ అవెంత నెరవేరాయో బయటికి రాలేదు. ఇదంతా ఒక ఎత్తయితే ఇంత కాలానికి బాలీవుడ్ డెబ్యూ చేసిన మన నాగ చైతన్యకు కూడా ఇది బ్యాడ్ లాంచ్ గా మిగిలిపోవడం అక్కినేని ఫ్యాన్స్ కి ఇంకా బాధ కలిగించింది. ఇప్పట్లో దాన్ని మర్చిపోవడం కష్టమే.
ఎప్పుడో 90 దశకంలో వచ్చిన ఫారెస్ట్ గంప్ ని ఖంగాళీ చేసుకున్న తర్వాత కూడా అమీర్ ఖాన్ కు ఫారిన్ రీమేకుల మీద మనసు పోలేనట్టుంది. తిరిగి ఇంకో విదేశీ చిత్రాన్ని ఎంచుకున్నాడని ముంబై టాక్. 2018లో వచ్చిన స్పానిష్ మూవీ క్యాంపియన్స్ ని హిందీలో చేయబోతున్నాడట. దీనికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ శంకర్ ఎహసాన్ లాయ్ త్రయంతో ఆల్రెడీ మొదలయ్యాయని సమాచారం. దర్శకుడు ఆర్ఎస్ ప్రసన్న. ఇతను గతంలో శుభ్ మంగళ్ సావధాన్ అనే ఎంటర్ టైనర్ తీశాడు. కేవలం పాతిక కోట్లతో తీస్తే డెబ్భై కోట్లు రాబట్టిన సూపర్ హిట్ ఇది.
అందుకే అతనికే ఈ బాధ్యతలు అప్పగించారని తెలిసింది. ఇదో కామెడీ డ్రామా. కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా ఉండవు. యాక్షన్ ఎలిమెంట్స్ అసలే లేవు. అయినా అమీర్ దీన్ని ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఏముందో తెలియాలంటే అది వచ్చే దాకా ఆగాలి. 2023 జనవరిలో స్టార్ట్ అవుతుందట. ఈసారి ఎంత టైం తీసుకుంటారో చూడాలి. అయినా రీమేకుల ప్రవాహం హిందీ నుంచి తెలుగు దాకా అన్ని భాషల్లో ఉన్నదే కానీ మన ఆడియన్స్ నేటివిటీకి తగ్గట్టు ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని దిగితే బాగుంటుంది. లేదంటే లాల్ సింగ్ చడ్డాలు రిపీట్ అవుతూనే ఉంటాయి.
This post was last modified on September 29, 2022 7:31 am
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…