Movie News

వర్షంలో మెగాస్టార్ ఉద్వేగం

అనంతపూర్ లో జరిగిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ బాగా ఆలస్యం జరగడంతో వరుణ దేవుడు పలకరించేశాడు. ముందు తొలకరి జల్లుగా మొదలైనప్పటికీ చివరికది భారీ వర్షంగా మారడంతో చిరంజీవి తడుస్తూనే ప్రసంగించాల్సి వచ్చింది. పక్కనే ఉన్నవాళ్లు ముందు గొడుగు పట్టే ప్రయత్నం చేసినా ఆయన వారించి తీసేశారు. ఈ సందర్భంగా రాయలసీమకు ఎప్పుడు వచ్చినా ఇలా వర్షం స్వాగతం చెప్పడం చాలా సంతోషంగా ఉందని చెప్పిన చిరు తన స్పీచ్ కు ముందు ఇవాళ కన్నుమూసిన ఇందిరాదేవిగారికి సభపైనే నివాళి అర్పించారు.

సహజంగా ప్రతి ఈవెంట్ మాటల్లో ఒకింత ఎగ్జైట్ మెంట్ ఫీలయ్యే మెగాస్టార్ ఈసారి మరింత ఎక్కువ ఉద్వేగానికి గురయ్యారు. అది ఆయన టెంపోలోనే అర్థమైపోయింది. ఆచార్య తాలూకు ఫలితాన్ని నేరుగా ప్రస్తావించకపోయినా అది స్ఫురించేలా ఈసారి నిరాశ పరచనని హామీ ఇవ్వడం ఫ్యాన్స్ కి ఊరట కలిగించింది. ఇక తమన్ ని ఏకంగా ఆకాశానికెత్తేశారు. పదే పదే పొగిడేశారు. నిజానికి వచ్చిన రెండు పాటలు, ట్రైలర్ లో బిజిఎం తన బెస్ట్ వర్క్ అనిపించేలా లేవని సోషల్ మీడియాలో డిబేట్ జరుగుతుండగా ఇలా అనడం గమనార్హం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకో లెవెల్ లో ఉంటుందని తెగ ఊరించేశారు.

సత్యదేవ్, దర్శకుడు మోహన్ రాజాల గురించి ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ చాలానే చెప్పుకొచ్చారు. తన అభిమానులే గాడ్ ఫాదర్లని ఫ్యాన్స్ మీద ప్రశంసల జల్లులు కురిపించారు. ఇదంతా బాగానే ఉంది కానీ మూడు నాలుగు గంటల పాటు ఇతర నటీనటుల స్పీచులు, ఏవిలు, పాటలు, డాన్సులతో విపరీత కాలయాపన చేస్తూ అసలు విషయానికి వచ్చేటప్పటికి ఇలాంటి ఇబ్బంది ఎదురు కావడం ఈ మధ్య చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు జరిగింది. విరాట పర్వం సైతం కర్నూలులో జరిగినప్పుడు అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. ఇకనైనా రెండు గంటల లోపే పూర్తి చేసేలా ప్లానింగ్ చేస్తే బాగుంటుందేమో.

This post was last modified on September 29, 2022 7:29 am

Share

Recent Posts

చంద్ర‌బాబుకు మరో ట్యాగ్

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు గురించి.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జాతీయ మీడియా వాట‌ర్ మ్యాన్ అంటూ.. ప్ర‌శంస‌లు…

43 minutes ago

ఇక నారా లోకేశ్ వంతు!

ఏపీలో ఇప్పటికే ఫలితాలు వెల్లడైన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి పార్టీలు విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే. అయితే,…

1 hour ago

ఆల్కహాల్ తాగడానికి టైమ్ సరిపోతుందా

అల్లరి నరేష్ హీరోగా రూపొందిన ఆల్కహాల్ చాలా నెలలుగా ల్యాబ్ లో మగ్గుతోంది. సితార లాంటి పెద్ద సంస్థ నిర్మాణంలో…

3 hours ago

బుచ్చిబాబుకు ఒక్కో ఈవెంట్‌కు 10 వేలిచ్చినా…

కొన్ని నెలల ముందు ‘పెద్ది’ సినిమాతో వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు బుచ్చిబాబు సానా. ఐతే ఆ సినిమా అంతిమంగా ఆశించిన…

4 hours ago

ఎన్విడియా సీఈఓకు కొత్త చిక్కులు.. ఆఫీసులోనే మరో లవ్ ట్రాక్..

ఏఐ చిప్స్‌తో ప్రపంచ టెక్నాలజీని షేక్ చేస్తున్న ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ఇప్పుడు తన వ్యక్తిగత వ్యవహారాలతో వార్తల్లోకి…

4 hours ago

మౌళి బ్రాండ్ విలువకు పెద్ద పరీక్ష

రేపు డీఎన్‌కే విడుదల కానుంది. మైత్రి నిర్మాణం కావడంతో రిలీజ్ పరంగా మంచి స్క్రీన్ కౌంట్ దక్కనుంది. రామాయణ పార్ట్…

5 hours ago