Movie News

పొన్నియన్ తారల పారితోషికాలు

రోజుల నుంచి పొన్నియన్ సెల్వన్ 1 విడుదల గంటల్లోకి మారిపోయింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు తమిళనాడులో బాహబలి రేంజ్ ఫీవర్ దీనికి కనిపిస్తోంది. తెల్లవారుఝాము నాలుగు గంటల షోలకే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు మణిరత్నం ఈసారి ఓ రేంజ్ లో దూసుకుపోయేలా ఉన్నారు. అయితే ఇతర డబ్బింగ్ వెర్షన్లకు ఇంత దూకుడు కనిపించడం లేదు. హైదరాబాద్ లాంటి ప్రధాన కేంద్రాలు మినహాయించి చాలా చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా సాగుతున్నాయి. రెస్పాన్స్ పాజిటివ్ గా ఉంటే ఊపందుకుంటాయి.

ఇక దీని బడ్జెట్ కు సంబంధించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. యూనిట్ చెప్పిన ప్రకారమే రెండు భాగాలకు కలిపి అయిదు వందల కోట్ల దాకా ఖర్చయ్యిందట. కేవలం అయిదు నెలల్లో షూటింగ్ పూర్తి చేశారు. పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ సమయం పట్టింది. ఇంత పెద్ద కాన్వాస్ ఉన్న మల్టీస్టారర్ లో రెమ్యునరేషన్ల గురించి ప్రశ్నలు తలెత్తడం సహజం. చెన్నై టాక్ ప్రకారం ఈ మొత్తం సుమారు 50 కోట్లకు పైమాటే ఉంటుందని అంటున్నారు. ఆయా నటీనటుల కెరీర్లలో అత్యధికంగా ఎంత తీసుకున్నారో అంతా ఇచ్చారట.

వాటి ప్రకారం విక్రమ్ 12 కోట్లు, ఐశ్వర్య రాయ్ 10 కోట్లు, జయం రవి 8 కోట్లు, కార్తీ 5 కోట్లు, త్రిష 2.5 కోట్లు, ఐశ్వర్య లక్ష్మి 1.5 కోట్లు, ప్రభు 1.25 లక్షలు, శోభిత ధూళిపాళ 1 కోటి, ప్రకాష్ రాజ్ 1 కోటి, శరత్ కుమార్ 1 కోటి ఇలా మెయిన్ క్యాస్టింగ్ కే 44 కోట్లకు పైమాటే అయ్యింది. మిగిలిన సపోర్టింగ్ యాక్టర్స్, వేలాది జూనియర్ ఆర్టిస్టులు, వందలాది సాంకేతిక నిపుణులు, నిర్మాణాంతర కార్యక్రమాలు, ప్రమోషనల్ ఈవెంట్ వగైరా కలిపితే ఎంతవుతుందో ఠక్కున చెప్పడం కష్టం. బ్లాక్ బస్టర్ కొట్టిందా అంతకంతా వెనక్కు వస్తుంది కానీ లేదంటేనే చిక్కు. చూద్దాం ఇంకొద్ది గంటల్లో మణిరత్నం మేజిక్ పని చేసిందో లేదో తేలపోతుంది.

This post was last modified on September 28, 2022 10:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

20 minutes ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

3 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

4 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

4 hours ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

5 hours ago

తిరుమలపై ఎందుకీ పగ..?

తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…

5 hours ago