ప్రస్తుతం ఇండియాలో సినిమాలు, అలాగే రియాలిటీ షోలు, ఇంకా ప్రకటనల కోసం అత్యధిక పారితోషకం అందుకునే హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. ఎప్పట్నుంచో తాను నడిపిస్తున్న బిగ్ బాస్ షోకు సంబంధించి సల్మాన్ వందల కోట్ల పారితోషకం అందుకుంటున్నాడు కొన్నేళ్ల నుంచి. గత సీజన్‌కు అతను రూ.300 కోట్లకు పైగానే పారితోషకం అందుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. దానికే అందరూ ముక్కున వేలేసుకున్నారు. బిగ్ బాస్ షోకు ఎంత రీచ్ ఉన్నప్పటికీ.. మరీ ఇంత పారితోషకమా అని అంతా ఆశ్చర్యపోయారు.
ఐతే ఇప్పుడు బిగ్ బాస్ కొత్త సీజన్‌కు ఏకంగా రూ.1000 కోట్ల మేర సల్మాన్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా మీడియాలో ఒక హాట్ రూమర్ మొదలైంది. దీనిపై స్వయంగా సల్మాన్ స్పందించాడు. ఆ ప్రచారాన్ని ఖండించారు. మీడియాలో ప్రచారంలో ఉన్న ఫిగర్‌తో పోలిస్తే అందులో నాలుగో వంతు కూడా తాను పారితోషకం కింద పుచ్చుకోవట్లేదని సల్మాన్ స్పష్టం చేశాడు.
“నా పారితోషకం గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను వెయ్యి కోట్ల పారితోషకం తీసుకుంటే ఇక జీవితంలో పని చేయాల్సిన అవసరమే ఉండదు. కానీ ఏదో ఒక రోజు నేను ఆ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటా. ఎందుకంటే నాకు లాయర్ ఫీజులతో పాటు అనేక రకాల ఖర్చులున్నాయి. అవి నాకెంతో అవసరం. మీరు చెప్పే మొత్తంలో నా సంపాదన నాలుగో వంతు కూడా ఉండదు. మీడియాలో వచ్చే వార్తలను ఇన్‌కం ట్యాక్స్, ఈడీ అధికారులు కూడా చదువుతారని గుర్తుంచుకోవాలి. ఇక బిగ్ బాస్ షో విషయానికి వస్తే.. దీని విషయంలో గతంలో చాలాసార్లు విసిగిపోయి ఇక నేను ఈ షోను హోస్ట్ చేయలేనని చెప్పాను. వాళ్లకు వేరే ఛాయిస్ లేకే నన్నే సంప్రదిస్తూ వచ్చారు. ఒకవేళ వాళ్లకు వేరే ఛాయిస్ ఉంటే నన్ను ఎప్పుడో మార్చేసేవాళ్లు. బిగ్ బాస్‌లో వచ్చే గొడవలు, విమర్శలు నన్నెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే నాకు అంతకుమించిన సమస్యలు వేరే ఉన్నాయి” అని సల్మాన్ తెలిపాడు.
This post was last modified on September 28, 2022 5:11 pm
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…