Movie News

విష్ణు సినిమాకు మంచి పబ్లిసిటీ

దసరాకు మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘గాడ్ ఫాదర్’తో పాటు అక్కినేని నాగార్జున మూవీ ‘ది ఘోస్ట్’ కూడా రిలీజవుతోందని తెలిసి.. పండుగ బరిలో నిలవడానికి చిన్న సినిమాలైన ‘స్వాతిముత్యం’, ‘జిన్నా’ నిలవడానికి సిద్ధపడడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ‘స్వాతిముత్యం’ సినిమాకు ముందు నుంచి దసరా రిలీజ్ ఫిక్స్ అనే చెబుతూ వచ్చారు.

మంచు విష్ణు మూవీ ‘జిన్నా’ కొంచెం లేటుగా రేసులోకి వచ్చింది. ఈ సినిమాను అక్టోబరు 5న రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన అయితే ఇవ్వలేదు కానీ.. డిస్ట్రిబ్యూటర్లకు, మీడియాకు హింట్ అయితే ఇచ్చారు. స్వయంగా విష్ణునే ‘అక్టోబరు 5?’ అంటూ ఒక ట్వీట్ కూడా చేశాడు. అది చూసి ఏంటి విష్ణు కాన్ఫిడెన్స్ అనుకున్నారంతా. ఐతే రిలీజ్ చేస్తారో లేదో తర్వాత.. దసరా బరిలో ‘జిన్నా’ అంటే మంచి పబ్లిసిటీ వస్తుందనే ఉద్దేశంతోనే విష్ణు అండ్ కో ఇలా చేస్తోందేమో అన్న చర్చ కూడా జరిగింది.

నిజానికి ‘స్వాతిముత్యం’ సినిమా విషయంలోనూ ఇలాంటి సందేహాలే కలిగాయి. కానీ ఆ చిత్ర బృందం థియేట్రికల్ రిలీజ్ కూడా లాంచ్ చేసి నిజంగానే దసరా రేసులో నిలవబోతున్నట్లు స్పష్టం చేసింది. కానీ ‘జిన్నా’ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. ఈ సినిమా దసరా బరిలో లేదన్నది స్పష్టం.

‘గాడ్ ఫాదర్’ రిలీజ్ విషయంలో సందేహాలు నెలకొనడంతో ‘జిన్నా’ను దసరా రేసులో నిలపాలని విష్ణు సీరియస్‌గానే ఆలోచించాడు. కానీ చిరు సినిమా పండక్కి ఫిక్సవడంతో ఇంత పోటీ మధ్య ఎందుకని వెనక్కి తగ్గినట్లున్నాడు. ఏదైతేనేం.. ‘జిన్నా’ గురించి గత కొన్ని రోజుల్లో బాగానే చర్చ జరిగింది. సినిమాకు మంచి పబ్లిసిటీ వచ్చింది. విష్ణు గత సినిమాలు దారుణమైన ఫలితాలందుకున్నప్పటికీ ఆ ప్రభావం ‘జిన్నా’ మీద పెద్దగా పడనట్లే ఉంది. ఈ సినిమాకు డీసెంట్ బజ్ కనిపిస్తోంది. అక్టోబరులోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

This post was last modified on September 27, 2022 1:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు ఐడియా: డ్వాక్రా పురుష గ్రూపులు!

రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అన‌గానే మ‌హిళ‌లే గుర్తుకు వ‌స్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా సంఘాలు!…

1 hour ago

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

8 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

9 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

9 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

10 hours ago