బ్రహ్మాస్త్ర సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే ఆ చిత్రం ఇంకా థియేటర్లలో నిలబడకూడదు. ఈపాటికే దాని థియేట్రికల్ రన్ ముగిసిపోయి ఉండాలి. తొలి వీకెండ్లో టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు సాధించిన ఆ సినిమా.. ఆ తర్వాత జోరు తగ్గించింది. వీక్ డేస్ లో వసూళ్లు పడిపోయాయి. రెండో వీకెండ్లో సినిమా కొంచెం పుంజుకున్నప్పటికీ.. అది రికవరీకి సరిపోయేలా కనిపించలేదు.
ఐతే ఈ నెల 23న నేషనల్ సినిమా డేను పురస్కరించుకుని ఉత్తరాదిన అంతటా రూ.75 టికెట్ రేటు పెట్టగా.. ఈ అవకాశాన్ని బ్రహ్మాస్త్ర చాలా బాగా ఉపయోగించుకుంది. త్రీడీలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న ఈ చిత్రాన్ని చూడడానికి జనం ఎగబడ్డారు. తొలి రోజుకు దీటుగా ఆ రోజు టికెట్లు తెగాయి బ్రహ్మాస్త్రకు. ఇది చూసి దాని డిస్ట్రిబ్యూటర్లు వ్యూహం మార్చారు. ఇప్పుడో మాస్టర్ ప్లాన్ తో రంగంలోకి దిగారు.
తక్కువ రేటుంటే సినిమా చూడ్డానికి ఎక్కువ మంది వస్తారనే విషయాన్ని గుర్తించి సోమవారం నుంచి గురువారం వరకు టికెట్ ధరను రూ.100కు ఫిక్స్ చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దసరా సెలవులు నడుస్తున్నాయి. ఇప్పుడు వీక్ డేస్ లో కూడా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. బ్రహ్మాస్త్రకు పోటీగా చెప్పుకోదగ్గ హిందీ సినిమా ఏదీ లేదు. ఇప్పటికీ హిందీ ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ బ్రహ్మాస్త్రనే. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తక్కువ రేటు పెడితే ఆక్యుపెన్సీ బాగా పెరుగుతుందని భావించి వీక్ డేస్ లో రేటు తగ్గించారు.
మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ అని తేడా లేకుండా ఫ్లాట్ రేటు పెడుతుండటంతో ఫుట్ ఫాల్స్ బాగా పెరగబోతున్నాయన్నది స్పష్టం. ఈ మోడల్ విజయవంతం అయితే మున్ముందు కూడా ఇలా రేట్లు తగ్గించి ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించే ప్రణాళికలు కొనసాగే అవకాశముంది.
This post was last modified on September 25, 2022 10:22 pm
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…