ఇటీవలి నేషనల్ సినిమా డే పథకంలో భాగంగా 75 రూపాయలకే మల్టీప్లెక్సుల్లో టికెట్లు అమ్మడం బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో మల్టీ ప్లెక్సులు ఈ అవకాశాన్ని మరింత పొడిగించే నిర్ణయం తీసుకున్నాయి. ఒకే రోజు 65 లక్షల టికెట్లు అమ్ముడుపోవడం చూసి సదరు యాజమాన్యాలు షాక్ తిన్నాయి. మధ్య తరగతి ఉద్యోగులు కుటుంబాలతో సహా వచ్చి లోపల ఇంటీరియర్ల దగ్గర సెల్ఫీలు దిగడం చూసి తాము మిడిల్ క్లాస్ ని ఎంత దూరం చేసుకున్నాయో అర్థం చేసుకున్నాయి. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో మరిన్ని వెసులుబాట్లు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాయి.
రేపటి నుంచి అంటే 26 నుంచి 29 దాకా బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివని అసోసియేషన్ లో భాగంగా ఉన్న మల్టీప్లెక్సులు థియేటర్లలో కేవలం 100 రూపాయలకే చూసేయొచ్చు. నాలుగు రోజుల పాటు ఏ షో అయినా సరే ఇదే ధర ఉంటుంది. దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ కన్సెషన్ ఉండటం లేదు. ప్రభుత్వాలకు విన్నవించి లైసెన్సింగ్, ధరల విధానంలో మార్పు తీసుకురావడం ద్వారా టాలీవుడ్ ఆడియన్స్ కి సైతం ఇలాంటి స్కీంలు అందుబాటులోకి తేవొచ్చు. ఉత్తరాది ప్రేక్షకులు మాత్రం మరో నాలుగు రోజులు పండగ చేసుకోబోతున్నారు. బ్రహ్మాస్త్ర రెండువందల ఏభై కోట్ల మార్కుకు దగ్గరలో ఉంది.
ఈ ట్రెండ్ ని క్రమం తప్పకుండా కొనసాగించేందుకు ఇప్పుడీ సంస్థలన్నీ పునరాలోచనలో పడ్డాయి. ఒకటి రెండు వారాలయ్యాక స్లో అయిన సినిమాలకు ఇలాంటి ఆఫర్లు రెగ్యులర్ గా ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చలు చేస్తున్నాయి. బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు సైతం ఈ పోకడను ప్రోత్సహిస్తున్నారు. కేవలం వీకెండ్ ని నమ్ముకోకుండా మాములు రోజుల్లో కూడా థియేటర్లు నిండాలంటే ఇంత కంటే మంచి మార్గం లేదంటున్నారు. పైగా అన్నీ బ్రహ్మాస్త్రలాగా అడవు కాబట్టి డిజాస్టర్లకు సైతం అంతో ఇంతో రికవరీ రావాలంటే ఇలాంటివి చేయడం చాలా అవసరం. ఎటొచ్చి మన ఏపీ తెలంగాణలో కూడా తీసుకొస్తే బెటర్!
This post was last modified on September 25, 2022 4:32 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…