Venkatesh In Rana Naidu Netflix Webseries
ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం కలిసుందాం రా, నువ్వు నాకు నచ్చావ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ లు విక్టరీ వెంకటేష్ ని ఎక్కవ ఫ్యామిలీ సినిమాల వైపు ప్రేరేపించిన మాట వాస్తవం. తనలో మాస్ ఎనర్జీ ఉన్నప్పటికీ ఎందుకో ఆ జానర్ ని ఆ తర్వాత ఎక్కువ టచ్ చేయలేకపోయారు. జెమిని ప్రతికూల ఫలితం, ఘర్షణ గణేష్ లాంటివి హిట్ అనిపించుకున్నా కమర్షియల్ గా పెద్ద స్కేల్ కు వెళ్ళకపోవడం లాంటి కారణాలు క్రమంగా వాటికి దూరమయ్యేలా చేశాయి. కానీ సరైన కథ దర్శకుడు దొరికితే వెంకీని పర్ఫెక్ట్ మాస్ లో చూపించొచ్చని బొబ్బిలి రాజా, కూలీ నెంబర్ వన్, శత్రువు, సూర్యవంశం లాంటి ఎన్నో సినిమాలు ఋజువు చేశాయి.
ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం నిన్న రిలీజైన రానా నాయుడు టీజర్. భారీ బడ్జెట్ తో బాబాయ్ అబ్బాయి వెంకటేష్ రానాల కాంబినేషన్ లో నెట్ ఫ్లిక్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ కాంబో ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నదే. కేవలం నిమిషంలోపే కట్ చేసినప్పటికీ ఈ చిన్న వీడియోలోనే బోలెడంత ఫ్యాన్ స్టఫ్ ఇచ్చేశారు. ముఖ్యంగా జైల్లో బారుడు తెల్ల గెడ్డంతో వెంకీని చూపించడం, బయటికి వచ్చాక తమిళ హీరో అజిత్ స్టైల్ లో దాన్ని ట్రిమ్ చేయించి అల్ట్రా స్టైలిష్ గా ప్రెజెంట్ చేయడం అంచనాలను అమాంతం పెంచేశాయి.
ఇదేదో బిగ్ స్క్రీన్ కోసం చేసుండొచ్చు కదానేదే అభిమానుల ఆవేదన. ఇది థియేటర్ కోసం నిర్మించింది కానప్పటికీ ఇలాంటి గెటప్, ఊర మాస్ లుక్ ని వెండితెర మీద ఎంజాయ్ చేసేందుకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నారప్ప విషయంలోనూ ఇలాగే జరిగింది. ఇది తెలిసే ఎఫ్3 క్లైమాక్స్ లో అలా కాసేపు కనిపించి ఊరట కలిగించారు. ఇప్పుడు రానా నాయుడు వంతు వచ్చింది. ఏది ఏమైనా రాబోయే సినిమాల్లో అయినా విక్టరీ వెంకటేష్ కంప్లీట్ కమర్షియల్ మూవీ ఒకటి సోలో హీరోగా చేస్తే చూడాలని కోరుకుంటున్నారు. జయం మనదేరా టైపులో ఒకటి పడితే ఆ కిక్కు వేరే.
This post was last modified on September 25, 2022 1:28 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…