Movie News

కుర్ర హీరోలూ – పారాహుషార్

పరిశ్రమలో పోటీ పెరుగుతోంది. బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లేకపోయినా కష్టపడి పైకొచ్చినా లేదా ఏవైనా రికమండేషన్లతో ఇండస్ట్రీకి వచ్చినా ఇక్కడ సక్సెసే మాట్లాడుతుంది. రెండు మూడు ఫ్లాపులు వచ్చాయా అంతే సంగతులు. ఒకప్పుడంటే అలనాటి ఎన్టీఆర్ నుంచి చిరంజీవి హయాం దాకా ఫలితంతో సంబంధం లేకుండా థియేటర్ బిజినెస్ బాగుండేది. బ్లాక్ బస్టర్ పడిందా రూపాయికి అయిదు రూపాయలు, డిజాస్టర్ కొట్టిందా పెట్టుబడి మాత్రం గ్యారెంటీగా వెనక్కు వచ్చేది. ఎందుకంటే టైంపాస్ కి అప్పట్లో ఇంటర్ నెట్లు, 4జిలు, ఓటిటిలు, వేలల్లో ఛానళ్ళు లేవు కాబట్టి.

ఇప్పుడు కాలం మారింది. ముఖ్యంగా కరోనా తర్వాత ఆడియన్స్ అభిరుచులు విపరీతమైన మార్పులకు గురయ్యాయి. ఆషామాషీ కథలతో జనాన్ని మొదటి ఆటకు రప్పించడమే సవాల్ గా మారుతోంది. ఈ విషయాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా దారుణమైన తిరస్కారం తప్పడం లేదు. ముఖ్యంగా ఇరవై ముప్పై ఏళ్ళ కెరీర్ నిర్మించుకుందామని వచ్చిన కుర్ర హీరోలు స్క్రిప్ట్ విషయంలో చేస్తున్న తప్పులు భారీ మూల్యాన్ని చెల్లించేలా ప్రేరేపిస్తున్నాయి. పట్టుమని మూడు రోజులు కూడా హాలు నింపలేని కంటెంట్ తో నిర్మాతలకు బయ్యర్లకు పీడకలలు మిగిలిస్తున్నాయి.

అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సెన్సేషనల్ హిట్లతో యూత్ లో అశేషమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రతి సినిమా ఫలితాన్ని అంతకంతా కిందకు తీసుకెళ్తోంది. లైగర్ కన్నా పీక్స్ ని ఇక ఆశించలేం. ప్యాన్ ఇండియా ఉచ్చులో పడి చేతులారా పరిస్థితిని దిగజార్చుకున్నాడు. స్వంతంగా ఎదుగుతున్నాడనే సాఫ్ట్ కార్నర్ తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం లేనిపోని మాస్ ట్రాప్ కు తనకు తానుగా బలయ్యి నేను మీకు బాగా కావాల్సినవాడినితో బంగారం లాంటి మార్కెట్ ని అమాంతం తగ్గించేసుకున్నాడు.

దర్శకుడు ఎగ్జైటింగ్ గా కథ చెప్పాడన్న కారణంతో ఇలాంటివి గతంలో ఎన్ని వచ్చాయో చెక్ చేసుకోకుండా, తన బాడీ లాంగ్వేజ్ కి సూట్ అవుతుందో లేదో ఆలోచించకుండా శ్రీవిష్ణు చేసిన ప్రయోగం పట్ల జనం అంత సుముఖంగా లేరని అల్లూరి ఓపెనింగ్స్ ఋజువు చేశాయి. పోనీ టాక్ ఏమైనా బ్రహ్మాండంగా ఉందా అంటే అదీ లేదు. పికప్ ఏమో కానీ అతనికి పేరు తప్ప నిర్మాతకు డబ్బులొచ్చే సూచనలు తక్కువే. నాగ శౌర్య కృష్ణ వృంద విహారి ఉన్నంతలో కొంత బెటర్ అనిపించుకుంది కానీ అమాంతం కుటుంబ ప్రేక్షకులు ఎగబడి చూస్తున్న దాఖలాలు లేవు.

సబ్జెక్టులో రొటీన్ నెస్ ని పట్టించుకోకుండా రామ్ చేసిన ది వారియర్, నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం వాళ్ళ కెరీర్లలో మర్చిపోలేని చేదు జ్ఞాపకాలుగా మిగిలాయి. సదరు దర్శకులు ఆడియన్స్ ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడం వల్ల వచ్చిన ముప్పు ఇది. ఇప్పటి జెనరేషన్ కి సింక్ అయ్యే అవకాశం లేని నక్సల్ బ్యాక్ డ్రాప్ తో రానా తీసిన విరాట పర్వం సోషల్ మీడియా పొగడ్తలు తప్ప ఇంకేమి సాధించలేదు. నాగ చైతన్య థాంక్ యు రూపంలో బలవంతంగా ఎమోషన్లను రుద్దే ప్రయత్నం మిస్ ఫైర్ అయ్యింది. లాల్ సింగ్ చడ్డా కూడా తప్పుడు నిర్ణయమే.

అరిగిపోయిన స్పోర్ట్స్ డ్రామాని తెలిసీ వరుణ్ తేజ్ గనితో వస్తే కనీసం అభిమానులు సైతం చివరిదాకా దాన్ని భరించలేకపోయారు. ఇక్కడ చెప్పినవన్నీ గత తొమ్మిది నెలల్లో జరిగినవే. సీనియర్లకు ఇలాంటివి వస్తే పెద్దగా తేడా పడదు. ప్రత్యేకంగా వాళ్ళు సాధించాల్సింది ఏమీ ఉండదు కాబట్టి. కానీ కుర్రాళ్ళ సంగతలా కాదు. ఒక ఉదయ్ కిరణ్, తరుణ్, వరుణ్ సందేశ్ లాగా కెరీర్ లు తక్కువ స్పాన్ తో ఉండకూడదనుకుంటే మాత్రం కాంబినేషన్ల మోజులో పడకుండా పెద్ద బ్యానర్లనే గుడ్డి నమ్మకంతో వెళ్లకుండా తమకు సూటయ్యే వాటినే ఎంచుకుని వైవిధ్యంగా వెళ్తే భవిష్యత్తుకి ఢోకా ఉండదు. ఆలోచించుకోవాల్సింది ఈ యూత్ బ్యాచే.

This post was last modified on September 25, 2022 3:12 pm

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

2 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

4 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

5 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

5 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

7 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

7 hours ago