Movie News

పొన్నియన్ సెల్వన్.. అక్కడ మోతే

తమిళ సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సినిమా.. పొన్నియన్ సెల్వన్. వందల కోట్ల ఖర్చుతో, భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందించాడు మణిరత్నం. మూడు దశాబ్దాల ముందు నుంచి ఆయన్ని వెంటాడుతున్న ప్రాజెక్టు ఇది. గతంలో రెండు మూడుసార్లు సినిమాను పట్టాలెక్కించడానికి గట్టి ప్రయత్నం చేసి విఫలమైన మణిరత్నం.. ఎట్టకేలకు మూడేళ్ల కిందట ఈ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఎట్టకేలకు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఐతే తమిళంలో ఈ సినిమాకు ఉన్న హైప్.. మిగతా భాషల్లో లేదు. ‘బాహుబలి’ తరహాలో ఇది దేశవ్యాప్తంగా యుఫోరియా క్రియేట్ చేస్తుందని చిత్ర బృందం ఆశించింది కానీ.. తమిళనాడు అవతల ప్రేక్షకుల్లో ఆసక్తి అంతంతమాత్రంగానే ఉంది. కానీ అమెరికాలో ఈ సినిమాకు బంపర్ క్రేజ్ కనిపిస్తుండటం విశేషం. యుఎస్ ప్రిమియర్స్ వారం ముందే అక్కడ పెద్ద ఎత్తున టికెట్లు సేల్ అయ్యాయి.

విడుదలకు ఐదు రోజుల ముందే పొన్నియన్ సెల్వన్ హాఫ్ మిలియన్ డాలర్ల మార్కును అందుకోవడం విశేషం. ప్రి సేల్స్ గత రెండు మూడు రోజుల్లో బాగా పుంజుకున్నాయి. ఐతే చాలా వరకు తమిళ వెర్షన్ కోసమే బుకింగ్స్ జరిగాయి. తెలుగు, హిందీ వెర్షన్లకు అక్కడ కూడా పెద్దగా హైప్ లేదు. తమిళ జనాలు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారని.. బాహుబలికి తెలుగులో ఎంత హైప్ ఉందో తమిళం వరకు ఈ చిత్రంపై ఆ స్థాయిలో ఆసక్తి ఉందని స్పష్టమవుతోంది.

రిలీజ్ దగ్గర పడేసరికి ప్రి సేల్స్ ఇంకా పెరుగుతాయని.. ప్రిమియర్స్ మొదలవడానికి ముందే సినిమా మిలియన్ మార్కును టచ్ చేస్తుందని.. ప్రిమియర్స్ పూర్తయ్యేసరికి 1.5 మిలియన్ మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదని అక్కడి ట్రేడ్ పండిట్లు అంటున్నారు. తమిళనాడులో కూడా ఈ సినిమా ఓపెనింగ్స్ రికార్డులన్నీ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఇటీవలే ‘విక్రమ్’ సినిమా నెలకొల్పిన ఆల్ టైం రికార్డులన్నింటినీ కూడా బద్దలు కొట్టేసే అవకాశముంది.

This post was last modified on September 25, 2022 6:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు ఐడియా: డ్వాక్రా పురుష గ్రూపులు!

రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అన‌గానే మ‌హిళ‌లే గుర్తుకు వ‌స్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా సంఘాలు!…

26 minutes ago

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

7 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

8 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

8 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

9 hours ago