గత నెల మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా పోకిరి సినిమాకు స్పెషల్ షోలు ప్లాన్ చేయడం.. వాటి సంఖ్య రికార్డు స్థాయిలో దాదాపు 400కు చేరుకోవడం.. వసూళ్లు కోటిన్నర దాటిపోవడం చూసి అంతా ఔరా అనుకున్నారు. కానీ మూడు వారాలు తిరిగేసరికి ఈ రికార్డులన్నీ బద్దలైపోయాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘జల్సా’ సినిమాతో షోలు, కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు నెలకొల్పారు అభిమానులు.
ఇప్పుడు నందమూరి బాలకృష్ణ అభిమానుల వంతు వచ్చింది. ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో శని, ఆదివారాల్లో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎస్ లో భారీ లెవెల్లో షోలు ప్లాన్ చేశారు. ఐతే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సెంటర్లు, షోల వరకు రెస్పాన్స్ బాగానే ఉంది కానీ.. పోకిరి, జల్సా సినిమాల స్థాయిలో అయితే దీనికి హంగామా కనిపించట్లేదు. అన్ని షోలూ ఫుల్స్ పడే పరిస్థితి కనిపించడం లేదు. ఏపీ, తెలంగాణ వరకు పోకిరి, జల్సా వసూళ్లను ఇది అధిగమించే పరిస్థితి కనిపించడం లేదు.
ఐతే అమెరికాలో మాత్రం ‘చెన్నకేశవరెడ్డి’ సందడి మామూలుగా లేదు. అక్కడ ఏకంగా 32 లొకేషన్లలో 82 స్పెషల్ షోలు ప్లాన్ చేశారు. ఇప్పటిదాకా రీ రిలీజ్ లో ఏ సినిమాకూ ఇన్ని లొకేషన్లతో ఇంత భారీ స్థాయిలో షోలు పడలేదు. వసూళ్ల పరంగా కూడా పాత రికార్డులన్నీ ఆల్రెడీ బద్దలైపోయాయి. ‘పోకిరి’ మూవీకి యుఎస్ లో రూ.13 లక్షల గ్రాస్ రాగా.. ‘జల్సా’ సినిమా రూ.30 లక్షలతో కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ రికార్డు ఇప్పుడిప్పుడే బద్దలవుతుందని అనుకోలేదు.
కానీ ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాతో బాలయ్య అభిమానులు దాన్ని అధిగమించారు. ఇప్పటికే ఈ సినిమా వసూళ్లు అక్కడ రూ.32 లక్షలకు చేరుకుంది. ఐతే దీని వెనుక క్యాస్ట్ యాంగిల్ ఉందని వేరే హీరోల ఫ్యాన్స్ అంటున్నారు. మామూలుగానే బాలయ్య సామాజిక వర్గానికి చెందిన ఎన్నారైలు ఆయన సినిమాలను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటారు. థియేటర్లు థియేటర్లు బుక్ చేసి సినిమాలు చూస్తుంటారు. ‘చెన్నకేశవరెడ్డి’కి కూడా బాలయ్య అభిమానులు, టీడీపీ మద్దతుదారులు ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని షోలకు షోలు కొనేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on September 25, 2022 6:29 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…