నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం మొదలైనప్పటి నుంచి ఇందులో కథానాయిక గురించి కొన్ని రోజులుగా రకరకాల ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరో ముగ్గురో హీరోయిన్లు ఉంటారని అంటున్నారు.
ఐతే ఒక కథానాయికగా అంజలి ఖాయం అంటుండగా.. ఇంకో కథానాయికగా సోనాక్షి సిన్హా నుంచి అమలా పాల్ వరకు ఎన్నో పేర్లు వినిపించాయి. తాజాగా అమలా పాల్ పేరు ఖాయమైనట్లు ప్రచారం జరిగింది. ఐతే ఈ విషయంలో రూమర్లు మరీ ఎక్కువైపోతుండటంతో దర్శకుడు బోయపాటి శ్రీను స్పందించాడు.
ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. కథానాయిక విషయంలో క్లారిటీ ఇచ్చాడు. బాలయ్య కథానాయికగా ఎవరిని తీసుకుందాం.. స్టార్ హీరోయినా కొత్తమ్మాయా అని పలు విధాలుగా ఆలోచించి చివరికి ఓ కొత్త అమ్మాయిని ఎంచుకున్నట్లు బోయపాటి తెలిపాడు.
ఆ అమ్మాయి ఎవరన్నది ఇప్పుడే వెల్లడించమని.. మంచి సందర్భం చూసి అప్ డేట్ ఇస్తామని బోయపాటి తెలిపాడు. ఇక ఈ చిత్రానికి మోనార్క్ అని.. సూపర్ మ్యాన్ అని.. రకరకాల టైటిళ్లు కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం టైటిల్ కూడా ఖరారు చేశారని.. దాన్ని కూడా మంచి అకేషన్ చూసే ప్రకటిస్తారని అంటున్నారు. లాక్ డౌన్ పెట్టడానికి ముందు కేవలం ఐదు రోజుల షూటింగ్ జరిగింది ఈ చిత్రానికి సంబంధించి.
బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో సినిమా అంటే ముందు ఫైట్‌తో చిత్రీకరణ మొదలుపెట్టడం ఆనవాయితీ. వీళ్ల కలయికలో వస్తున్న మూడో సినిమా విషయంలోనూ అదే సెంటిమెంటు పాటించారు. ఆ రష్ నుంచి ఇటీవల బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా టీజర్ కట్ చేసి వదిలారు. దానికి మంచి స్పందన వచ్చింది. లాక్ డౌన్ షరతులన్నీ పోయి.. మామూలు పరిస్థితులు నెలకొన్నాక చిత్రీకరణ పున:ప్రారంభించనున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
This post was last modified on July 7, 2020 5:00 pm
గత వారం చివరి నిమిషంలో విడుదల వాయిదా పడిన అఖండ 2 ఇప్పుడు డిసెంబర్ 12 రావడం అంతా మంచికే…
భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కానీ దానికి సహేతుకమైన కారణం ఆమోదం దక్కుతుంది. సోషల్ మీడియా కాలంలో దీని…
ఏ సినిమాకైనా ‘ఎ’ సర్టిఫికెట్ ఎందుకు వస్తుంది? అందులో ఇంటిమేట్ సీన్ల డోస్ ఎక్కువ ఉండుండాలి. లేదంటే హింస, రక్తపాతం…
రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అడ్డంగా దొరికిపోయింది. అతను పార్టీకి ఏమాత్రం…
చంద్రబాబు గవర్నమెంట్ లో అన్నింటికీ ఒక లెక్క ఉంటుంది... అది పక్కాగా ఉంటుంది. కేవలం నోటిమాటలు కాకుండా ప్రతిదానికి డేటా…
హైదరాబాద్లోని చరిత్రాత్మక విశ్వవిద్యాలయం.. ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ). అనేక మంది మేధావులను మాత్రమే ఈ దేశానికి అందించడం కాదు.. అనేక ఉద్యమాలకు…