Movie News

మ‌హేష్‌-రాజ‌మౌళి.. ఆలూలేదు చూలూ లేదు

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళిల కాంబినేష‌న్లో సినిమా గురించి చ‌ర్చ ఇప్ప‌టిది కాదు. పుష్క‌రం కింద‌టే ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. ఐతే ఎట్ట‌కేల‌కు రెండేళ్ల కింద‌ట ఈ ప్రాజెక్టు క‌న్ఫ‌మ్ అయింది. కానీ ఈ సినిమా ప‌ట్టాలెక్క‌డానికి ఇంకా చాలా స‌మ‌య‌మే ప‌ట్టేలా ఉంది. ప్ర‌స్తుతానికి మ‌హేష్ బాబు.. త్రివిక్ర‌మ్ సినిమా మీదే ఫోక‌స్ పెట్టాడు.

ఈ సినిమా పూర్త‌యి విడుద‌ల కావ‌డానికి ప్ర‌స్తుత అంచ‌నాల ప్ర‌కారం ఇంకో ఎనిమిది నెల‌లు ప‌డుతుంది. అంత‌కంటే ఆల‌స్య‌మైనా ఆశ్చ‌ర్యం లేదు. ఆ త‌ర్వాత మ‌హేష్ రాజ‌మౌళి సినిమా కోసం మేకోవ‌ర్ కావాల్సి ఉంటుంది. ఆ సినిమాకు ఇంకా క‌థ కూడా ఫైన‌లైజ్ కాలేదు. ప్రి ప్రొడ‌క్ష‌న్ పనులేమీ మొద‌లే కాలేదు. ఇవ‌న్నీ జ‌రిగాకే కాస్టింగ్ గురించే ఆలోచిస్తారు.

కానీ మీడియాలో మాత్రం చాలా ముందుగానే కాస్టింగ్ గురించి ర‌క‌ర‌కాల ఊహాగానాలు వ‌చ్చేస్తున్నాయి. మ‌హేష్‌-రాజ‌మౌళి సినిమాలో క‌థానాయిక‌గా బాలీవుడ్ భామ ఆలియా భ‌ట్ న‌టిస్తుంద‌ని ఒక‌రంటే.. హాలీవుడ్ మూవీ బ్ల‌డ్ షాట్ ఫేమ్ ఐజా గొంజాలెజ్ పేరును ప‌రిశీలిస్తున్నార‌ని ఇంకొక‌రంటారు. ఇప్పుడేమో వ‌రుస‌గా కీల‌క పాత్రల కోసం హాలీవుడ్ ఆర్టిస్టుల పేర్లు తెర‌పైకి వ‌చ్చేశాయి. థోర్ యాక్ట‌ర్ క్రిస్ హేమ్స్‌వ‌ర్త్ ఈ చిత్రంలో ఎక్స్‌టెండెడ్ క్యామియో చేయ‌బోతున్నాడ‌ని.. అవెంజ‌ర్స్‌లో థానోస్ ప‌త్ర చేసిన జోష్ బోర్లిన్‌తోనూ ఈ చిత్ర బృందం చ‌ర్చ‌లు జ‌రుపుతోంద‌ని.. ఇంకా శామ్ జాక్స‌న్ పేరు కూడా ప‌రిశీల‌న‌లో ఉంద‌ని.. ఇలా ఎవ‌రికి తోచిన‌ట్లు వాళ్లు వార్త‌లు అల్లేస్తున్నారు.

హాలీవుడ్ కాస్టింగ్ ఏజెన్సీ సీఏఏతో రాజ‌మౌళి ఒప్పందం చేసుకుని కొన్ని రోజులే అయింది. ముందు ఈ సినిమాకు స్క్రిప్టు రెడీ అవ్వాలి. పాత్ర‌ల‌కు ఒక రూపు రావాలి. ఆ త‌ర్వాత వాటికి ఎవ‌రు అయితే బాగుంటుందో.. ఎవ‌రిని తీసుకుంటే సినిమా పాన్ వ‌ర‌ల్డ్ స్థాయికి వెళ్తుందో చూస్తారు. సినిమా బ‌డ్జెట్ ప‌రిమితుల‌ను కూడా దృష్టిలో ఉంచుకుని ఏదైనా చేయాల్సి ఉంటుంది. కానీ అలూ లేదు చూలు లేదు సామెత‌ను గుర్తు చేస్తూ అప్పుడే ఆర్టిస్టుల గురించి ఇలా ఇష్టం వ‌చ్చిన‌ట్లు ఊహాగానాలు సృష్టించ‌డం విడ్డూరం.

This post was last modified on September 24, 2022 5:48 pm

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

33 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago