Movie News

అక్టోబర్ 21 – మరో బిగ్ వార్

వచ్చే నెల దసరా పండగను టార్గెట్ చేసుకుని అక్టోబర్ 5 చిన్నా పెద్దా తేడా లేకుండా హీరోలు బాక్సాఫీసు యుద్ధానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్, ది ఘోస్ట్, స్వాతిముత్యం, జిన్నాలు నువ్వా నేనా అని సవాల్ విసురుకునేందుకు రెడీ అవుతున్నారు. ఎవరైనా డ్రాప్ అవుతారా లేదానేది ఇప్పుడే చెప్పలేం కానీ ప్రస్తుతానికి ఎవరికి వారు ఆ డేట్ ని లాక్ చేసుకుని కూర్చున్నారు. తర్వాత 14న తేదీ మాత్రమే చప్పగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, క్రేజీ ఫెలో లాంటి బడ్జెట్ చిత్రాలు తప్ప చెప్పుకునేంత పోటీ అయితే ఏం లేదు.

కథ ఇక్కడితో అయిపోలేదు. మరో బిగ్ వార్ అక్టోబర్ 21 దీపావళి పండగ సందర్భంగా రానుంది. ఇప్పటిదాకా కన్ఫర్మ్ అయినవాటిలో విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ మొదటిది. మొన్నటిదాకా లేని అంచనాలు విక్టరీ వెంకటేష్ స్పెషల్ క్యారెక్టర్ చేశాడని తెలియగానే అమాంతం పెరిగిపోయాయి. అక్కడికి ఆయనే హీరో అనే రేంజ్ లో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. అదే రోజు మాస్ మహారాజా రవితేజ ‘ధమాకా’ని రిలీజ్ చేసే ఆలోచనలో సదరు టీమ్ ఉన్నట్టు సమాచారం. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ ఎంటర్ టైనర్ లో శ్రీలీల హీరోయిన్.

జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ తమిళ హీరో శివకార్తికేయన్ కాంబోలో రూపొందిన ‘ప్రిన్స్’ని సైతం అదే టైంకి దింపాలనే ప్లానింగ్ జరుగుతోంది. దివాలి తమిళులకూ ముఖ్యమైన పండగ కావడంతో ఆ ఛాన్స్ ని వదులుకోవడం టీమ్ కు ఇష్టం లేదు. అయితే కార్తీ నటించిన ‘సర్దార్’ని కూడా అప్పుడే రిలీజ్ చేసే దిశగా ఆల్రెడీ ప్రమోషన్లు మొదలుపెట్టారు. ఇక్కడ చెప్పిన వాటిలో ఓరి దేవుడా ఒకటే అఫీషియల్ కాగా మిగిలినవి వారం పది రోజుల్లో ఖరారవుతాయి. ఇవి మాత్రమే కాదు హాలీవుడ్ మూవీ ‘బ్లాక్ ఆడమ్’ ఆల్రెడీ 21 మీద కర్చీఫ్ వేసేసింది. దాన్ని తక్కువంచనా వేయడానికి లేదు

This post was last modified on September 23, 2022 3:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాతో నాకే పోటీ అంటున్న అఖండ విలన్

ఆది పినిశెట్టి.. అచ్చమైన తెలుగు కుర్రాడు. కానీ నటుడిగా అతడికి తమిళంలోనే ఫస్ట్ బ్రేక్ వచ్చింది. అక్కడే ఎక్కువ సినిమాలు చేశాడు. లెజెండరీ…

6 minutes ago

బాధను మాయం చేసే ‘స్మృతి’ సీక్రెట్!

పెళ్లి రద్దయిన తర్వాత స్మృతి మంధాన మానసికంగా కృంగిపోతారని, కొన్నాళ్ళు బయట కనిపించరని చాలామంది అనుకున్నారు. కానీ ఆమె అందరి…

19 minutes ago

పంచాతీయ స్వ‌`రూపం`పై జ‌న‌సేన ఎఫెక్ట్ ..!

గ్రామ పంచాయ‌తీల‌పై జ‌న‌సేన పార్టీ ప‌ట్టు బిగించే దిశ‌గా అడుగులు వేస్తోంది. చేస్తున్న అభివృద్ధి, ఏర్పాటు చేస్తున్న మౌలిక స‌దుపాయాల‌ను…

59 minutes ago

ట్రంప్ గోల్డ్ కార్డ్.. టాలెంట్ ఉంటే సరిపోదు..

అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదివిన మనవాళ్లు డిగ్రీ చేతికి రాగానే పెట్టేబేడా సర్దుకుని వెనక్కి రావాల్సి వస్తోంది. ఎంత టాలెంట్…

1 hour ago

ఆ రాష్ట్రంలో 400 మంది చిన్నారులకు HIV

హెచ్ఐవీ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనిపై చైతన్యం తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తూ హెచ్ఐవి వ్యాప్తి…

2 hours ago

ఆఖరి నిమిషంలో ఆగిపోయిన అన్నగారు

అసలే బజ్ విషయంలో వెనుకబడి హైప్ కోసం నానా తంటాలు పడుతున్న వా వతియార్ (తెలుగులో అన్నగారు వస్తారు) విడుదల…

2 hours ago