ఆర్ఆర్ఆర్ వచ్చి ఆరు నెలలవుతున్నా జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ఇంకా మొదలుపెట్టకపోవడం అభిమానుల్లో అసహనాన్ని పెంచుతోంది. కొరటాల శివ ఫైనల్ వెర్షన్ ని మెప్పించేలా రాయలేకపోతున్నాడనే వార్త వాళ్ళ ఆందోళనను ఎక్కువ చేస్తోంది. పోనీ హీరో దర్శకుల్లో ఒక్కరైనా అదేం లేదు ఫలానా డేట్ కి స్టార్ట్ చేస్తామని ఖచ్చితంగా చెప్పలేకపోవడం అనుమానాలను ఇంకా బలోపేతం చేస్తోంది. మరోవైపు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు యంగ్ టైగర్ కోసం రాసుకుంటున్న స్క్రిప్ట్ ఎప్పుడు తెరకెక్కుతుందో అదీ అంతుచిక్కడం లేదు. ఇవే ఇంత లేట్ అయితే కెజిఎఫ్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందనేది భేతాళ ప్రశ్న.
ఈ విషయాలు కాసేపు పక్కనపెడితే జూనియర్ కు ఇప్పటికిప్పుడు అవసరం లేని పొలిటికల్ ఫోకస్ రావడం మరింత ఇబ్బంది కలిగించే పరిణామం. ఆ మధ్య అమిత్ షా ప్రత్యేకంగా హైదరాబాద్ లో కలుసుకున్నప్పుడు న్యూస్ ఛానల్స్ చేసిన రభస అంతా ఇంతా కాదు. అక్కడికేదో బిజెపిలో చేరిపోయాడన్నంత హంగామా చేశాయి. కేవలం ట్రిపులార్ లో నటనను మెచ్చుకోవడానికి మాత్రమే మీటింగ్ జరిగిందనే లాజిక్ నిజమే అనుకుంటే అంతే సమానంగా గుర్తించాల్సిన రాజమౌళి, రామ్ చరణ్ లతో కూడా ఓ సమావేశం పెట్టుండొచ్చుగా అనే వాదానికి సమాధానం చెప్పడం కష్టం.
తాజాగా ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ అని పేరు మార్చడం పట్ల ట్విట్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ హుందాగా స్పందించిన తీరు ఒకవైపు ప్రశంసలను మరోవైపు ఇంకో వర్గంలో అసంతృప్తిని కలగజేస్తోంది. సోషల్ మీడియా వేదికగా దీని మీద ఫ్యాన్ డిబేట్స్ జరుగుతున్నాయి. సోలో హీరోగా అరవింద సమేత వీర రాఘవ తర్వాత ఆర్ఆర్ఆర్ వల్ల ఏళ్లకేళ్లు గడిచిపోయాయని ఇప్పటికే ఫీలవుతుంటే ఇప్పుడు రాజకీయ అంశాల గురించి తారక్ మీద ఫోకస్ లైట్ పడటం కరెక్ట్ కాదనేది అభిమానుల ఆవేదన. కనీసం డైవెర్షన్ కోసమైనా తారక్ కొత్త సినిమా కబురు ఏదైనా పంచుకుంటే బెటర్.
This post was last modified on September 23, 2022 1:46 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…