అసలే అంచనాలు కొంత తక్కువ ఉన్న తరుణంలో ప్రమోషన్ల విషయంలో అంతా తానై ముందుకు నడిపించిన శ్రీవిష్ణు కొత్త సినిమా అల్లూరి ఇవాళ విడుదలన్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించడంతో మూవీలో మ్యాటర్ గట్టిగా ఉంటుందనే నమ్మకంతో మార్నింగ్ షోకు వెళ్లిన జనాలకు థియేటర్ దగ్గర షాక్ తగిలింది. ఏపీ తెలంగాణలో దాదాపు ఎక్కడా ఉదయం షోలు పడలేదు. సాంకేతిక కారణాలు చెబుతున్నారు కానీ వాస్తవానికి కథ వేరే ఉందని టాక్.
నిర్మాత బెక్కం వేణుగోపాల్ గత చిత్రాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఇప్పుడీ ఆలస్యానికి దారి తీశాయని ట్రేడ్ టాక్. మధ్యాహ్నం నుంచి ఆడించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఉదయం అదే పనిగా హాలుకు చేరుకున్న ప్రేక్షకులకు మాత్రం నిరాశ తప్పలేదు . శ్రీవిష్ణు తనవంతుగా ఇష్యూ ని సెటిల్ చేసేందుకు నిన్న సాయంత్రమే పూనుకున్నారని, ఈ రోజు షోలు మొదలయ్యే టైంకి ఎలాంటి చిక్కులు ఉండవనే టాక్ వచ్చింది కానీ ఆ వ్యవహారం కూడా లేట్ అయ్యింది. ఓపెనింగ్ పరంగా ఇది దెబ్బ తీసే అంశమే.
సినిమా చిన్నదైనా పెద్దదైనా వీలైనంత ముందుగా ప్రిపేర్డ్ గా ఉండటం చాలా అవసరం. ఒక్కసారి జనంలో ఆసక్తి తగ్గిపోతే మళ్ళీ వాళ్ళను వెనక్కు రప్పించడం కష్టం. సరే అల్లూరి చూడలేదు కదాని ఏ కృష్ణ వృందా విహారికో దొంగలున్నారు జాగ్రత్తకో వెళ్తే తిరిగి శ్రీవిష్ణు కోసం అదే పనిగా వస్తారన్న గ్యారెంటీ లేదు. సరే జాప్యం జరిగినా ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఓకే. ఇబ్బంది ఉండదు. అలా జరగకపోతే పరిణామాలు వేరుగా ఉంటాయి. మొత్తానికి కుర్ర హీరో కష్టానికి ఫస్ట్ షోకు ఇలా ట్విస్ట్ వచ్చి పడింది. ఇవి అప్పుడప్పుడు జరగడం సహజమే అయినా ముందుజాగ్రత్త చాలా అవసరం.
This post was last modified on September 23, 2022 12:49 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…