500 కోట్ల ప్రాజెక్ట్ తో వినాయక్ ?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో వీవీ వినాయక్ ఒకరు. మాస్ కమర్షియల్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకొని మంచి కెరీర్ చూశాడు. కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులు అందుకున్న వినాయక్ ‘ఖైదీ 150’తో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ తర్వాత ‘ ఇంటెలిజెంట్’ అనే డిజాస్టర్ తీసి గ్యాప్ తీసుకున్నాడు.

ప్రస్తుతం రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతిని బెల్లంకొండ శ్రీనివాస్ తో హిందీలో తీస్తున్నాడు. అయితే ఈ సినిమా ఔట్ పుట్ చూసి పెన్ మూవీస్ వీవీ వినాయక్ కి 500 కోట్ల బడ్జెట్ ఫిలిం ఆఫర్ ఇచ్చారట. ఈ విషయాన్ని బెల్లంకొండ సురేష్ మీడియాతో పంచుకున్నాడు. చెన్న కేశవ రెడ్డి రీ రిలీజ్ కి సంబంధించి వీవీ వినాయక్ తో కలిసి బెల్లంకొండ సురేష్ ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు. అందులో భాగంగా తన ఛత్రపతి సినిమా గురించి కూడా మాట్లాడాడు సురేష్.

ఇక త్వరలోనే వీవీ వినాయక్ ను హీరోగా పెట్టి సినిమా తీసే ఆలోచన ఉందని చెప్పుకున్నాడు. హీరోలంతా ఫుల్ బిజీగా ఉన్నారని, ఈ సమయంలో వినాయక్ హీరోగా రాణించాల్సి ఉందని, మంచి మనసున్న హీరో కృష్ణ లాగా వినాయక్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా అంటూ సురేష్ మాట్లాడారు.

నిజానికి బెల్లంకొండ చెప్పినట్టు వీవీ వినాయక్ మీద 500కోట్ల బడ్జెట్ పెట్టేందుకు పెన్ మూవీస్ అంతా సాహసం చేస్తుందా ? ఇదంతా తన కొడుకు హిందీ సినిమా కు పాజిటివ్ గా చెప్పుకోవడం కోసమే బెల్లంకొండ సురేష్ ఇలా మాట్లాడి ఉంటారేమో నన్నసందేహం ప్రేక్షకులకు కలుగుతుంది. అలాగే వీవీ వినాయక్ హీరోగా సినిమాలు చేయాలని కోరుకోవడం బాగానే ఉంది కానీ కృష్ణ గారితో పోల్చడం ఎందుకో బెల్లంకొండ కే తెలియాలి.