పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే గత కొన్నేళ్లలో టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో కార్తికేయ-3 ఒకటిగా నిలుస్తుంది. ఈ చిన్న సినిమా పాన్ ఇండియా లెవెల్లో సృష్టించిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే. హిందీలో నామమాత్రంగా రిలీజై రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి.. విడుదలైన నెల తర్వాత కూడా హౌస్ ఫుల్స్‌తో రన్ అవడం అంటే మామూలు విషయం కాదు.
ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి.. ఇంకా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా విడుదల కాకముందే దీనికి సీక్వెల్ తీసే ఉద్దేశంతో ఉన్నారు హీరో కార్తికేయ, దర్శకుడు చందూ మొండేటి. ఇక సినిమా అంత పెద్ద సక్సెస్ అయ్యాక ఎందుకు ఆగుతారు?
కార్తికేయ పాత్రను పెట్టి ఎన్ని సినిమాలైనా తీయడానికి స్కోప్ ఉండేలా ఫ్లాట్ ఫామ్ రెడీ చేసేశాడు దర్శకుడు చందూ. కార్తికేయ-3 విషయంలో తగ్గేదే లేదని నిఖిల్ కూడా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కార్తికేయను మించి కార్తికేయ-2 పెద్ద సక్సెస్ అయిందని.. ప్రేక్షకులు ఇచ్చిన ప్రోత్సాహంతో, వారి దీవెనలతో కార్తికేయ-3 తీయబోతున్నామని.. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది అనే క్యూరియాసిటీతో తాను ఉన్నట్లు నిఖిల్ చెప్పాడు.
ఈసారి ఇంకా పెద్ద కాన్వాస్‌లో, త్రీడీలో సినిమా చేయబోతున్నట్లు కూడా నిఖిల్ వెల్లడించాడు. కార్తికేయ-2లోనే మూడో భాగం గురించి హింట్ కూడా ఇచ్చారు. ఈసారి హీరో ఇంటర్నేషనల్ లెవెల్‌కు వెళ్లబోతున్నాడు. కథ దేశ విదేశాల్లో నడవబోతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.
This post was last modified on September 22, 2022 4:20 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…