తమిళనాడు అనే కాదు.. సౌత్ ఇండియా మొత్తంలో బిగ్గెస్ట్ స్టార్లలో అజిత్ కుమార్ ఒకడు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి అడుగు పెట్టి, కెరీర్ ఆరంభంలో ఎక్కువగా క్లాస్ లవ్ స్టోరీలే చేసి.. ఆ తర్వాత తిరుగులేని మాస్ ఇమేజ్‌తో కోలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడిగా ఎదిగాడు అజిత్.
విశ్వాసం లాంటి మామూలు మాస్ సినిమాతో తమిళనాట వసూళ్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడం అజిత్‌కే చెల్లింది. అజిత్ కొత్త సినిమాల నుంచి ఏదైనా అప్‌డేట్ వస్తోందంటే అభిమానులు చేసే హంగామా అలా ఇలా ఉండదు. వాళ్లను ఈసారి పెద్దగా ఊరించకుండానే.. సడెన్ సర్ప్రైజ్ లాగా తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయించేశాడు అజిత్.
హెచ్.వినోద్ దర్శకత్వంలో ఆయన నటించిన కొత్త సినిమాకు తునివు అనే టైటిల్ ఖరారు చేశారు. నో గట్స్ నో గ్లోరీ అనేది క్యాప్షన్. తునివు అంటే తమిళంలో దృఢత్వం అని అర్థం. టైటిల్‌తో పాటు లాంచ్ అయిన ఫస్ట్ లుక్ కూడా అభిమానుల్లో అంచనాలు పెంచేలా ఉంది.
పూర్తిగా తెల్లబడ్డ జుట్టు, గడ్డంతో కనిపిస్తున్న అజిత్.. మెషీన్ గన్ పట్టుకుని విధ్వంసానికి సిద్ధమవుతున్నట్లుగా ఉంది ఫస్ట్ లుక్. ఈ సినిమాలో యాక్షన్ డోస్ ఒక రేంజిలో ఉండబోతోందని ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రం 2023 సంక్రాంతికి విడుదల కాబోతోంది.
అజిత్ ఒక దర్శకుడు లేదా నిర్మాతతో కనెక్ట్ అయితే వరుసగా వాళ్లతోనే సినిమాలు చేస్తుంటాడు. ఇంతకుముందు శివ దర్శకత్వంలో వరుసగా సినిమాలు చేశాడు. ఇప్పుడు దర్శకుడు హెచ్.వినోద్, నిర్మాత బోనీ కపూర్‌లతోనూ అలాగే వరుసగా కాంబినేషన్లు సెట్ చేస్తున్నాడు. వీరి కలయికలో ఇప్పటికే నీర్కొండ పార్వై, వలిమై చిత్రాలు వచ్చాయి. ఈ కాంబోలో తునివు వరుసగా మూడో చిత్రం కావడం విశేషం. ఈ చిత్రంలో మలయాళ హీరోయిన్ మంజు వారియర్ కీలక పాత్రలో నటిస్తోంది. బహుశా ఆమెది అజిత్ భార్య పాత్ర అయి ఉండొచ్చు. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
This post was last modified on September 22, 2022 6:58 am
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…