ఎల్లుండి విడుదల కాబోతున్న అల్లూరి పట్ల హీరో శ్రీవిష్ణు చాలా ఎగ్జైట్ మెంట్ తో పాటు నెర్వస్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటిదాకా విభిన్నమైన పాత్రలతో అధిక శాతం పక్కింటి కుర్రాడి క్యారెక్టర్స్ లో కనిపించిన దానికి భిన్నంగా మీసాలు పెంచి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించడం ఇదే మొదటిసారి. అందులోనూ ఎందరో సీనియర్లు జూనియర్లు ఖాకీ డ్రెస్సులో చీల్చి చెండాడిన బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. వాటికి ధీటుగా ఇది నిలుస్తుందన్న నమ్మకం అతనిలో కనబడుతోంది. అందుకే 2 గంటల 50 నిమిషాల నిడివికి సైతం ఓకే చెప్పాడంటే కంటెంట్ ఏదో బలంగా ఉన్నట్టే.
అల్లూరి ట్రైలర్ చూశాక కథ మీద ఒక అవగాహన వచ్చింది కానీ సెన్సార్ కోసం అప్లై చేసినప్పుడు వాళ్ళు జారీ చేసిన సవరణల్లో ఒక కీలక ట్విస్టు షాకింగ్ తరహాలో ఉంది. టెర్రరిస్థులకు దొరికిన హీరోకు ఉప్పెన తరహాలో దారుణంగా అతన్ని గాయపరిచే ఎపిసోడ్ ఒకటి ఇందులో ఉంది. దాన్ని సగానికి పైగా తగ్గించమని చెప్పడం చూస్తే ఇదేదో హై ఇంటెన్సిటీ ఉన్న వయొలెంట్ ఎపిసోడ్ లా తోస్తోంది. దానికి ఒప్పుకున్న యూనిట్ ఏడు నిమిషాల దాకా కోత పెట్టిందట. ఇదే ఇలా ఉంటే నిజంగా యూనిట్ ముందు నుంచి చెబుతున్నట్టు డబుల్ డోస్ యాక్షన్ కి ఢోకా లేదన్న మాట.
శ్రీవిష్ణుకి దీని సక్సెస్ చాలా కీలకం. రాజరాజ చోర తర్వాత రెండు డిజాస్టర్లు గట్టిగానే దెబ్బ కొట్టాయి. ఎప్పుడో అయిదేళ్ల క్రితం సిద్దమైన అల్లూరి స్క్రిప్ట్ ని అక్షరం మార్చకుండా యధాతథంగా తీశామని ప్రత్యేకంగా చెప్పిన శ్రీవిష్ణు మరి ఆ తర్వాత కోవిడ్ పరిణామాలు, మారిపోయిన జనాల అభిరుచులు, ఓటిటి ట్రెండ్ తాలూకు ప్రభావాలు ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నారో లేదో చూడాలి. అసలే కృష్ణ వృందా విహారి, దొంగలున్నారు జాగ్రత్తతో పోటీ పడుతున్న అల్లూరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా రావడం ఆడియన్స్ అటెన్షన్ తీసుకోవడానికి ఉపయోగపడింది. ఫలితం చూడాలి మరి
This post was last modified on September 22, 2022 7:01 am
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…