ఈ మధ్య సమంత సినిమాల వ్యవహారం కంటే ఆమె వ్యక్తిగత విషయాలే ఎక్కువగా మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి. గత ఏడాది అక్కినేని నాగచైతన్య నుంచి విడాకులు తీసుకోవడం గురించి కొన్ని నెలల పాటు ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. ఇప్పటికీ ఆ చర్చకు తెరపడట్లేదు. ఇంతలో ఆమె ఆరోగ్యం గురించి కొత్త చర్చ మొదలైంది.
సమంత ఏవో అనారోగ్య సమస్యలతో బాధ పడుతోందని.. ట్రీట్మెంట్ కోసం అమెరికాకు వెళ్లిందని.. అందుకే తన కొత్త చిత్రం ఖుషి చిత్రీకరణను మధ్యలో ఆపేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది కొన్ని రోజులుగా. కొన్ని రోజుల నుంచి ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో సామ్ కనిపించకపోవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది.
సమంత అనారోగ్యం గురించి, యుఎస్ ట్రిప్ గురించి వార్తలు మొదలయ్యాక మూణ్నాలుగు రోజులు ఆమె వైపు నుంచి ఎలాంటి ఖండన కూడా లేదు. ఐతే ఒక ఇంగ్లిష్ డైలీ సామ్ మేనేజర్‌ను ఈ విషయమై సంప్రదించగా.. అందరూ ఊహించినట్లే ఈ వార్తలు కేవలం రూమర్లే అంటూ ఖండించేశారు. కానీ సమంత యుఎస్‌కు వెళ్లడం గురించి, అందుకు కారణాల గురించి మాత్రం ఆయన ఏమీ మాట్లాడలేదు. వివరాలు చెప్పడానికి ఇష్టపడలేదు.
మీడియాలో జరుగుతున్న ప్రచారం అబద్ధం అయితే.. సామ్ ఫలానా కారణంతో యుఎస్ వెళ్లింది అని వివరణ ఇవ్వాల్సింది. అలా కాకుండా ఈ ప్రచారం నిజం కాదు అని ఒక్క ముక్కలో తేల్చేసి ఊరుకోవడంతో సామ్ ఫ్యాన్స్‌కు మరిన్ని సందేహాలు కలుగుతున్నాయి. సమంత ఏదో చర్మ సమస్యతో బాధపడుతున్నట్లు, సర్జరీ కూడా చేయించుకున్నట్లు గతంలో జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా అదే సమస్యతో ఆమె యుఎస్‌కు వెళ్లినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
This post was last modified on September 21, 2022 7:48 pm
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…