వరుస హిట్స్ వస్తే ఇండస్ట్రీలో హీరోయిన్ కి లక్కీ బ్యూటీ అనే ముద్ర , వరుస ఫ్లాపులు వస్తే పక్కన పెట్టేయడం సర్వసాధారణం. తాజాగా హాట్ బ్యూటీ కేతిక శర్మ మీద అన్ లక్కీ అనే ముద్ర వేసేశారు. దీనికి స్ట్రాంగ్ రీజన్ ఉంది. అమ్మడు తెలుగులో చేసిన మూడు సినిమాలు డిజాస్టర్స్ అవ్వడమే దీనికి కారణం. పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ అనే సినిమాతో ఈ డిల్లీ బ్యూటీ పరిచయమైంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ ఇంటర్వ్యూ చేయడంతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఆ సినిమా రిజల్ట్ ఏమైందో అందరికీ తెలిసిందే.
ఆ వెంటనే నాగ శౌర్య ‘లక్ష్య’ సినిమాలో చాన్స్ అందుకుంది కేతిక. పిజికల్ గా బాగా శౌర్య ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. సిక్స్ ప్యాక్ చేసి కొత్తగా కనిపించాడు. ఆర్చెరీ నేపథ్యంతో స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అనిపించుకుంది. ఇక కేతిక మూడో తెలుగు సినిమా ‘రంగ రంగ వైభవంగా’ గురించి తెలిసిందే. సినిమా ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
ఒక్క ఫ్లాప్ , డిజాస్టర్ వస్తే వేరు కానీ మరీ ఇలా హ్యాట్రిక్ డిజాస్టర్స్ అంటే ఇండస్ట్రీలో ఆఫర్స్ దక్కించుకోవడం కష్టమే. కాకపోతే కేతిక అందాల ఆరబోతతో ఇంకా ఒకటి రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉంది. వాటిలో ఏదైనా హిట్ అయితే ఈ బ్యూటీకి మళ్ళీ చాన్సులు వస్తాయి. లేదంటే డిజాస్టర్స్ హీరోయిన్ అనే ముద్రతో అన్ లక్కీ బ్యూటీగా టాలీవుడ్ కి దూరమావ్వడం ఖాయం.
This post was last modified on September 22, 2022 9:43 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…