ఎట్టకేలకు గాడ్ ఫాదర్ లిరికల్ వీడియో

మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’ నుండి ఫస్ట్ లిరికల్ వీడియో రిలీజైంది. సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నటించిన సల్మాన్ ఖాన్ తో కలిసి మెగా స్టార్ డాన్స్ వేసే ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. రెండ్రోజుల ముందే ఈ సాంగ్ రిలీజ్ అవ్వల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల కేవలం ఆడియో మాత్రమే రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను నిరాశ పరిచారు. దీంతో అప్పటి నుండి ఈ వీడియో సాంగ్ కోసం వెయిట్ చేశారు మెగా అభిమానులు.

ఇప్పుడు లిరికల్ వీడియో సాంగ్ వదిలి మెగా ఫ్యాన్స్ కి అలాగే సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్. తమన్ ఈ సాంగ్ కోసం ఎనర్జిటిక్ నంబర్ కంపోజ్ చేశాడు. కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ లిరికల్ వీడియోలో కట్ చేసిన విజువల్స్ మెగా డాన్స్ స్టెప్స్ మూవీ లవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తున్నాయి. ముఖ్యంగా చిరు . సల్మాన్ కలిసి వేసే స్టెప్స్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నాయి.

ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ లో తను కూడా కనిపించనున్నాడు. చిరు -సల్మాన్ ఖాన్ తో కలిసి ఎనర్జిటిక్ స్టెప్ వేసిన బిట్ లిరికల్ వీడియోలో చూపించి ఈ సాంగ్ లో ముగ్గురు ఒకే ఫ్రేం లో కనిపించనున్నారని విజువల్ గ్లిమ్స్ తో చూపించారు. కాస్త ఆలయంగా వచ్చినప్పటికీ గాడ్ ఫాదర్ లిరికల్ వీడియో ఆకట్టుకుంది. మరి ఈ సాంగ్ సినిమాలో ఎండ్ టైటిల్స్ లో వస్తుందా ? లేదా మిడిల్లో ఎక్కడైనా ఆ స్పేస్ క్రియేట్ చేసి లింక్ చేశారో చూడాలి.