సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. లక్ష్మీ కళ్యాణం అనే చిన్న సినిమాతో ప్రస్థానం ఆరంభించి.. కొన్నేళ్లలోనే మగధీర లాంటి మెగా మూవీలో కథానాయికగా అవకాశం అందుకుని, స్టార్ హీరోయిన్ అయిన ఆమె.. ఆ తర్వాత ఇటు తెలుగులో, అటు తమిళంలో పెద్ద పెద్ద హీరోల సరసన భారీ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. అడపాదడపా బాలీవుడ్లోనూ కొన్న పేరున్న చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించింది.
ఎలాంటి హీరోయిన్‌కైనా ఒక దశ దాటాక పెద్ద సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతుంటాయి కానీ.. కాజల్‌కు మాత్రం అలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. హఠాత్తుగా పెళ్లి చేసుకుని బిడ్డకు జన్మనివ్వబోతున్న స్థితిలో కూడా ఆమె చేతిలో ఆచార్య, ఇండియన్-2 సినిమాలున్నాయి.
ఐతే అనూహ్య పరిస్థితుల్లో ఆచార్యలో ఆమె క్యారెక్టర్ని లేపేశారు. ఇండియన్-2 మధ్యలో ఆగిపోయింది. ఆ టైంలోనే బిడ్డకు జన్మనిచ్చింది కాజల్. ఇక ఆమె కెరీర్ ముగిసినట్లే అనుకున్నారు కానీ.. కాజల్ మాత్రం ఆశలు వదులుకోలేదు. తల్లి అయిన కొన్ని నెలల తర్వాత తిరిగి సినిమాల్లోకి రావడానికి సన్నాహాలు చేసుకుంది. ఇటీవలే ఇండియన్-2 పట్టాలెక్కడంతో ఆ సినిమాను పూర్తి చేయడం అనివార్యం. దీంతో పాటు కొత్త సినిమాల్లోనూ నటించాలనుకుంటోందేమో.. అందుకోసం కసరత్తులు మొదలుపెట్టింది చందమామ.
తాజాగా ఆమె తన పునరాగమనాన్ని ఒక వీడియో ద్వారా వెల్లడించింది. అందులో హార్స్ రైడింగ్ చేస్తూ కనిపించింది కాజల్. ఒకప్పుడు తన ఎనర్జీ లెవెల్స్ గొప్పగా ఉండేవని, ఎంత కష్టమైనా పడేదాన్నని, రోజంతా షూటింగ్‌లో పాల్గొని కూడా తర్వాత జిమ్‌కు వెళ్లేదాన్నని, కానీ బిడ్డను కన్నాక శరీరంలో మార్పులు చోటు చేసుకుని అంత కష్టపడలేకపోతున్నానని.. అయినా పట్టువిడవకుండా కష్టపడుతున్నానంటూ కాజల్ ఈ వీడియోతో పాటు ఒక ఎమోషనల్ పోస్టు పెట్టింది. కాజల్ కష్టం అర్థం చేసుకుని ఆమెకు మనో ధైర్యాన్నిచ్చేలా కామెంట్లు పెడుతూ, వెల్కం బ్యాక్ అంటూ ఆమెకు స్వాగతం పలుకుతున్నారు అభిమానులు.
This post was last modified on September 21, 2022 2:47 pm
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…
2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తామే విజయం దక్కించుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు…