అసలేమాత్రం ఊహకందకుండా కేవలం రాబోయే ట్రైలర్ లో ఒక పది సెకండ్ల ఆడియో క్లిప్ ఇంత వైరల్ అవుతుందని బహుశా గాడ్ ఫాదర్ టీమ్ ఏ మాత్రం ఊహించి ఉండదు. కామెడీ ఏంటంటే ఇదేదో సీరియస్ అన్నారని కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండా కొన్ని న్యూస్ ఛానల్స్ ఏకంగా లైవ్ డిబేట్లు పెట్టేశాయి. సినిమా రంగం మీద అంతగా అవగాహన లేని సామాన్యులకు మెగాస్టార్ నిజంగానే పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తున్నాడనుకున్నారు. ఏ టైమింగ్ లో ఇది పెట్టాలని చిరంజీవి అనుకున్నారో కానీ దాని లక్ష్యం సంపూర్ణంగా కాదు ఏకంగా హద్దులు దాటి ప్రయాణం చేసింది.
ఇదిలా ఉండగా గాడ్ ఫాదర్ అన్ని హక్కులు కలిపి 200 కోట్లకు పైగా డీల్ సెట్ చేసుకుందనే వార్త అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. ఒకపక్క బజ్ లేదని ఫీలవుతుంటే మరీ ఎక్కువ చేసి ఫిగర్లు చెబుతున్నారనే అనుమానం కలిగింది. ఇందులో కొంత నిజం లేకపోలేదు. ఓటిటి రైట్స్ సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ 57 కోట్లకు ఒప్పందం చేసుకుంది. హిందీ తెలుగు కలిపి ఈ రేటట. రెండు బాషల శాటిలైట్ హక్కులను 60 కోట్లకు ఇచ్చేశారు. ఇక్కడి దాకా నాన్ థియేట్రికల్ లెక్క చూసుకుంటే 117 కోట్లు అయ్యింది. ఆచార్య తర్వాత ఈ రేంజ్ అంటే చిన్న విషయం కాదు.
ఇక థియేటర్ సంగతి చూస్తే నిర్మాతలు 90 కోట్ల దాకా వరల్డ్ వైడ్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు అంత రిస్క్ చేసేందుకు సిద్ధంగా లేని పక్షంగా దీన్నే బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా పెట్టుకుని ప్రొడ్యూసర్లు ఓన్ రిలీజ్ కు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడా టార్గెట్ 207 కోట్లకు చేరుతుంది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇది అందుకోవడం ఈజీనే. లేదూ ఖైదీ నెంబర్ 150 రేంజ్ రెస్పాన్స్ వచ్చినా చాలు గట్టెక్కుతుంది. లేదూ బయ్యర్లకు ఇవ్వాలని డిసైడ్ అయితే మాత్రం ఇక్కడ చెప్పిన తొంబై కోట్ల ఫిగర్ లో చాలా మార్పు వస్తుంది. ఏది ఏమైనా నెగటివ్ పబ్లిసిటీ ఉన్న ట్రెండ్ లోనూ ఇంత రచ్చ చేయడం చిరుకే చెల్లింది .
This post was last modified on September 21, 2022 9:39 am
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…