ప్రమోషన్స్ పలు రకాలు. డిజిటల్ మీడియా వచ్చాక ఎన్నో రకాల ప్రమోషన్స్ చూస్తున్నాం. కుర్ర హీరోలు తమ సినిమాలకు బజ్ తీసుకురావడం కోసం పడరాని అన్ని పాట్లు పడుతున్నారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూలు చేసుకుంటున్నారు. ఈ నెల 23న రాబోయే చిన్న సినిమాలకు కుర్ర హీరోలు గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు.
తాజాగా నాగ శౌర్య తన కృష్ణ వ్రింద విహారి కోసం పాద యాత్ర చేశాడు. దీనికి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక మరో కుర్ర హీరో శ్రీ విష్ణు కూడా తన అల్లూరి సినిమా ప్రమోషన్స్ కోసం బాగా కష్టపడుతున్నాడు. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు స్టార్ హీరో అల్లు అర్జున్ ను రంగంలోకి దింపాడు. బన్నీ ప్రీ రిలీజ్ కి రావడం సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. బన్నీ ఫ్యాన్స్ నుండి సినిమాకు మంచి సపోర్ట్ దక్కే ఛాన్స్ ఉంది. కానీ శ్రీ విష్ణు ఇంకా డిఫరెంట్ ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నాడు. రిలీజ్ కి ఇంకా రెండ్రోజులే ఉండటంతో తాజాగా డ్యూయల్ రోల్ ప్లే చేసి ఓ ఇంటర్వ్యూ చేశాడు.
అల్లూరి తో శ్రీ విష్ణు అంటూ తనని తనే ఇంటర్వ్యూ చేసుకున్నాడు. ఈ కాన్సెప్ట్ ఇంటర్వ్యూ ఐడియా బాగుంది. అలాగే శ్రీ విష్ణు రెండు వేరియేషన్స్ చూపిస్తూ సినిమా గురించి చేసిన కన్వర్జేషన్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసేలా ఉంది. ఇలా కుర్ర హీరో తన సినిమా కోసం బాగానే ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. మరి ఈ ప్రమోషన్స్ తో అల్లూరి కి ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో..? ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేస్తుందో వేచి చూడాలి.
This post was last modified on September 20, 2022 10:05 pm
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…