ఈ మధ్య స్టార్ హీరోల పాత సినిమాలను స్పెషల్ షోలుగా వేసి అభిమానులు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ పోకిరి సినిమాతో ట్రెండ్ సెట్ చేస్తే.. పవన్ కళ్యాణ్ అభిమానులు జల్సా మూవీతో ఆ ట్రెండ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆ సందర్భంగా హంగామా చూసిన మిగతా హీరోల అభిమానులు తమ కథానాయకుడి సినిమాలతోనూ ఇలా రచ్చ చేయాలని ఆశపడ్డారు.
త్వరలోనే బాలయ్య (Balakrishna) అభిమానులు ఇదే తరహాలో సందడి చేయబోతున్నట్లు సమాచారం. అలా అని వాళ్లేమీ బాలయ్య బ్లాక్‌బస్టర్ మూవీని ఎంచుకోలేదు. బాలయ్య బర్త్ డే కోసం ఎదురు చూడట్లేదు. బాలయ్య కెరీర్లో అంచనాలు అందుకోలేక బోల్తా కొట్టిన చెన్నకేశవ రెడ్డి సినిమాకు స్పెషల్ షోలు ప్లాన్ చేస్తుండడం విశేషం.
ఈ నెల 25తో చెన్నకేశవరెడ్డి(Chennakeshava Reddy) సినిమా విడుదలై 20 ఏళ్లు కాబోతోంది. ఈ సందర్భంగా యుఎస్ బాలయ్య ఫ్యాన్స్ ఈ సినిమాకు భారీ లెవెల్లో స్పెషల్ షోలు ప్లాన్ చేశారు. అక్టోబరు తొలి వారంలో ఈ షోలు ఉంటాయట. దాదాపు అక్కడ 25 షోలు దాకా ప్లాన్ చేస్తున్నారట. ఒక ఫ్లాప్ మూవీకి ఇంత పెద్ద సంఖ్యలో స్పెషల్ షోలంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. ప్రస్తుతానికి యుఎఎస్ షోల గురించే సమాచారం బయటికి వచ్చింది.
త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పెషల్ షోలు ప్లాన్ చేయొచ్చని అంటున్నారు. చెన్నకేశవరెడ్డి అప్పట్లో అంచనాలు అందుకోలేక ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ.. ఇందులో బాలయ్య సీనియర్ క్యారెక్టర్ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేదే. ఫ్యాన్ మూమెంట్స్ చాలా ఉన్న ఇలాంటి సినిమాలకు స్పెషల్ షోలు వేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. పవన్ ఫ్యాన్స్ కూడా జల్సా లాంటి యావరేజ్ మూవీతోనే మామూలు హంగామా చేయలేదు. బాలయ్య ఫ్యాన్స్ కూడా వారినే అనుసరిస్తున్నట్లున్నారు.
This post was last modified on September 20, 2022 5:08 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…