Movie News

డైలాగ్ తో గాడ్ ఫాదర్ ప్రమోషన్స్

‘గాడ్ ఫాదర్ ‘ ప్రమోషన్స్ మీద మెగా స్టార్ అండ్ టీమ్ ఫోకస్ పెట్టడం లేదని మెగా ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తాజాగా ఫస్ట్ సింగిల్ కూడా డిలే అవ్వడం, ఇంకా లిరికల్ వీడియో గురించి ఎలాంటి ఎనౌన్స్ మెంట్ రాకపోవడంతో ఫ్యాన్స్ మేకర్స్ మీద సోషల్ మీడియా వేదికగా ఒత్తిడి చేయడం మొదలెట్టారు. దీంతో స్వయంగా మెగా స్టార్ రంగంలోకి దిగారు.

ఓ వాయిస్ క్లిప్ తో గాడ్ ఫాదర్ రిలీజ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిరు. “నేను రాజకీయాలకు దూరం కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు.” అంటూ సినిమాలో ఉన్న ఓ డైలాగ్ ను రిలీజ్ చేసి సోషల్ మీడియాలో చర్చకు తెరలేపారు. అయితే ఇది సినిమాలోని డైలాగ్ అని చిరు అక్కడ చెప్పలేదు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పార్టీ ను కాంగ్రెస్ లోకి వీలినం చేసి కేంద్ర మంత్రి గా కూడా పనిచేశారు. కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల మీద పూర్తి ఫోకస్ పెట్టారు.

అయితే ఇప్పుడు చిరు లీక్ చేసిన డైలాగ్ వింటుంటే రాజకీయంగా కూడా హాట్ టాపిక్ అవుతుంది. సినిమాలో తన కారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఎలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయో మెగా స్టార్ ఈ ఆడియో తో చెప్పకనే చెప్పారు. మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన లూసిఫర్ కి రీమేక్ గా వస్తున్న గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న రిలీజ్ అవ్వనుంది. మరికొన్ని గంటల్లో ఫస్ట్ లిరికల్ వీడియో రిలీజ్ చేయబోతున్నారు. మరో ఐదు రోజుల్లో ట్రెయిలర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. నెలాఖరున అనంతపురంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటున్నారు. సో మెగా డైలాగ్ తో మెగా ప్రమోషన్స్ మొదలయినట్టే. ఇక నుండి గాడ్ ఫాదర్ నుండి వరుసగా అప్ డేట్స్ రానున్నాయి. సినిమా మీద బజ్ పెంచే సరికొత్త ప్రమోషన్స్ ప్లానింగ్ రెడీ చేస్తోంది టీమ్.

This post was last modified on September 20, 2022 5:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

58 minutes ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

3 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

3 hours ago

ప్రభాస్ విజయ్ ఇద్దరూ ఒకే దారిలో

జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…

5 hours ago

డేంజర్ బెల్స్ మ్రోగించిన అఖండ 2

బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…

7 hours ago

అన్నగారికి కొత్త డేట్?

డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…

7 hours ago