సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) అభిమానుల దృష్టంతా ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తమ హీరో చేస్తున్న సినిమా మీదే ఉంది. ఇంతకుముందు మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన అతడు, ఖలేజా ప్రేక్షకులకు చిత్రమైన అనుభూతిని, అనుభవాన్ని మిగిల్చాయి. అవి థియేటర్లలో రిలీజైనపుడు అనుకున్న స్థాయిలో ఆడలేదు. అతడు పాజిటిక్ టాక్ తెచ్చుకుని కూడా కమర్షియల్‌గా ఓ మోస్తరు స్థాయిలోనే ఆడింది.
ఖలేజా అయితే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని అందుకు తగ్గ ఫలితాన్నే అందుకుంది. కానీ ఈ రెండు చిత్రాలు టీవీల్లో తెగ ఆడేశాయి. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. వీటికి ఉన్న రిపీట్ వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. ఐతే ఖలేజా తర్వాత సుదీర్ఘ కాలానికి జత కడుతున్న మహేష్, త్రివిక్రమ్ నుంచి ఈసారి అతడు, ఖలేజాల క్లాసిక్ టచ్ మాత్రమే కాకక బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ కూడా ఆశిస్తున్నారు అభిమానులు.
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇటీవలే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లిన సంగతి తెలిసిందే. రామోజీ ఫిలిం సిటీలో భారీ యాక్షన్ ఘట్టంతో ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఐతే షూట్ మొదలైన కొన్ని రోజులకే ఒక విశేషాన్ని అభిమానులతో పంచుకోబోతున్నారు. ఈ సినిమా టైటిల్‌ను దసరాకే ప్రకటించేయబోతున్నట్లు సమాచారం. ఖలేజా టైటిల్ ప్రకటన విషయంలో చాలా జాప్యం జరగడంపై అప్పట్లో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా మహేష్-త్రివిక్రమ్ (Trivikram) కొత్త సినిమాకు ఉన్న క్రేజ్‌ను ప్రమోషన్ల ద్వారా పీక్స్‌కు తీసుకెళ్లే క్రమంలో ముందే టైటిల్ ప్రకటించి వైరల్ చేయాలని, ఆ తర్వాత కూడా సమయానుకూలంగా అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులను ఎంగేజ్ చేయాలని డిసైడయ్యారు. పాన్ ఇండియా లెవెల్లో అందరికీ కనెక్ట్ అయ్యేలా టైటిల్ ఉంటుందని.. దసరా రోజు చిన్న టీజర్‌తో పేరు ప్రకటిస్తారని సమాచారం.
This post was last modified on September 20, 2022 5:10 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…