Rao Ramesh
చాలామంది అనవసరంగా అయిన దానికి కాని దానికి సినిమా వాళ్లను టార్గెట్ చేస్తుంటారు కానీ.. నిజానికి వాళ్లది పెద్ద మనసే. ఛారిటీ విషయానికి వస్తే.. మిగతా రంగాల వాళ్ల కంటే వాళ్లు ముందుంటారు. తమను నమ్ముకున్న వారిని అన్ని రకాలుగా ఆదుకుంటూ ఉంటారు.
ఐతే కొందరు పావలా సాయం చేసి రూపాయి పబ్లిసిటీ చేసుకుంటారు కానీ.. మరికొందరు మాత్రం పెద్ద సాయాలు చేసి పబ్లిసిటీ దూరంగా ఉంటారు. సీనియర్ నటుడు రావు రమేష్ (Rao Ramesh) ఈ మధ్య అలాంటి సాయమే చేసి మీడియా కంట్లో పడకుండా ఉండిపోయారు. తన దగ్గర దీర్ఘ కాలంగా మేకప్ మ్యాన్‌గా పని చేసి.. ఇటీవల ఓ ప్రమాదంలో చనిపోయిన బాబు అనే వ్యక్తి కుటుంబాన్ని రావు రమేష్ ఆదుకున్నారు.
ఆ కుటుంబానికి ఏకంగా రూ.10 లక్షల రూపాయల సాయం చేశారు. ఈమేరకు ఆయన చెక్కు అందజేశారు. దీంతో పాటు అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉంటానని రావు రమేష్ హామీ ఇచ్చారు. వేలల్లో సాయం చేసి కూడా పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసుకునే వాళ్లుంటారు. కానీ తన మేకప్ మ్యాన్ చనిపోతే రూ.10 లక్షల సాయం అందజేసి, పబ్లిసిటీ చేసుకోకపోవడంలో రావు రమేష్ గొప్పదనం అర్థం చేసుకోవచ్చు.
దిగ్గజ నటుడు రావు గోపాల్రావు తనయుడు అయినప్పటికీ.. చాన్నాళ్లు ఆయన తండ్రి పేరు వాడుకోలేదు. రావు గోపాల్రావు తనయుడు అని చాలాకాలం జనాలకు తెలియనివ్వలేదు. సొంతంగా కష్టపడి నటుడిగా ఎదిగారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ప్రస్తుతం దక్షిణాదిన మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ విలన్‌గా కొనసాగుతున్నారు.
This post was last modified on September 20, 2022 5:05 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…