దిల్ బేచరా.. ఇప్పుడు భారతీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్న సినిమా. మూడు వారాల కిందట ఆత్మహత్యకు పాల్పడి అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చిన బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి సినిమా ఇదే. ఈ చిత్రాన్ని డిస్నీ+హాట్ స్టార్ సంస్థ ఈ నెల 24న నేరుగా ఆన్ లైన్లో స్ట్రీమ్ చేయనుంది.
సోమవారమే ఈ చిత్ర ట్రైలర్ రిలీజైంది. అంచనాలకు తగ్గని విధంగా.. హార్ట్ టచింగ్‌గా ఉన్న ట్రైలర్.. అందరినీ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచింది. ఈ ట్రైలర్ రిలీజైన మూడు గంటల్లోనే మిలియన్ లైక్స్ వచ్చాయి యూట్యూబ్‌లో. అప్పుడే వ్యూస్ కూడా 40 లక్షలు దాటిపోయాయి. ఇండియాలో ఇప్పటిదాకా ఏ సినిమా ట్రైలర్‌కూ ఇంత వేగంగా ఇన్ని లైక్స్ రాలేదు. దీన్ని బట్టి సుశాంత్ మీద ప్రేక్షకుల్లో ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక దిల్ బేచరా విషయానికి వస్తే.. ఇది ఓ హాలీవుడ్ మూవీకి రీమేక్ కావడం విశేషం. ఆ సినిమా పేరు.. ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్. ఇది 2014లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం అంతకు రెండేళ్ల ముందు ఇదే పేరుతో రిలీజైన నవల ఆధారంగా తెరకెక్కింది. ఇప్పుడు ఆ పుస్తకం, సినిమా హక్కులు తీసుకుని హిందీలో దిల్ బేచరా సినిమాను రూపొందించారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించింది.
ఈ చిత్రంతో సుశాంత్ తొలి సినిమా కై పో చేకు దర్శకత్వ శాఖలో పని చేసి.. ఆ తర్వాత అతడి స్నేహితుడిగా కొనసాగిన ముకేష్ చబ్రా దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా అతడికిదే తొలి సినిమా. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన సంజన సంఘికి కూడా ఇదే తొలి సినిమా. ఆమె సుశాంత్ మీద మీ టూ ఆరోపణలు చేసినట్లు గత ఏడాది వార్తలొచ్చాయి. కానీ అదంతా అబద్ధమని అప్పుడామె ఖండించింది. దర్శకుడు, హీరోయిన్లకు తొలి సినిమా అయినా దిల్ బేచరా.. సుశాంత్‌కు చివరి సినిమాగా మారడం విషాదం.
This post was last modified on July 7, 2020 11:11 am
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…