సీనియర్ దర్శకుడు తేజ ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్. ఆయన కెరీర్లో చాలా వరకు లవ్ స్టోరీలే తీశాడు. ఐతే చాలా వరకు ఆయన సినిమాల్లో అందమైన హీరో హీరోయిన్లను పెట్టుకునేవాడు. కానీ ఈసారి మాత్రం ఆయన రూటు మారుస్తున్నాడు.
దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఆయన అహింస అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ కుర్రాడు లుక్స్ పరంగా అంతంతమాత్రమే. ఇంటర్నెట్లో కనిపించే ఫొటోలు చూస్తే సాధారణంగానే కనిపిస్తాడు.
సినిమా కోసం అతడికేమీ పెద్దగా మెరుగులు దిద్దినట్లు కనిపించడం లేదు. నేచురల్‌గా చూపించాలన్న ఉద్దేశంతో పెద్దగా మేకప్, వేరే రకమైన కరెక్షన్లు ఏమీ లేకుండా సినిమాలో సాధారణంగా చూపించాలనుకున్నట్లున్నాడు తేజ. అతడి పక్కన గీతిక అనే కొత్తమ్మాయిని హీరోయిన్‌గా ఎంచుకున్నాడు తేజ. ఆమె కూడా సాధారణంగానే అనిపిస్తోంది.
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. అందులో విజువల్స్ చూస్తే.. ఒక నది, జలపాతం నేపథ్యంలో ఆహ్లాదకరంగా అనిపిస్తున్న.. హీరో హీరోయిన్లయితే మామూలుగా కనిపించారు. హీరో హీరోయిన్లు మరీ డీగ్లామరస్‌గా కనిపించారు ఈ పాటలో.
అందులోనూ హీరోయిన్ అయితే పేషెంట్ పాత్రలో కనిపించడం.. ఆమెను ఒక తోపుడు బండిలో పెట్టి హీరో తోసుకెళ్లడం, ఎప్పుడూ ఆమెకు ఒక సెలైన్ బాటిల్ పెట్టి ఉండడం ఇదంతా చూస్తే మామూలుగా లవ్ స్టోరీల నుంచి ఆశించే ఆహ్లాదకరమైన రొమాంటిక్ మూమెంట్స్ ఏమీ ఇందులో ఉండవని.. సినిమా హార్డ్ హిట్టింగ్‌గా, కొంచెం విషాదభరితంగా, అలజడితో సాగుతుందని అర్థమవుతోంది.
తేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన నువ్వు నేను మూవీ ఛాయలు ఇందులో కనిపిస్తున్నాయి. ఆ చిత్రాన్ని నిర్మించిన జెమిని కిరణ్.. సురేష్ బాబుతో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆర్పీ పట్నాయక్ తేజ సినిమాకు సంగీతం అందించడం విశేషం. సిద్ శ్రీరామ్ పాడిన తొలి పాట పర్వాలేదనిపించింది.
This post was last modified on September 20, 2022 2:24 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…